Mercury Transit: బుధుడి సంచారంతో ఈ 5 రాశులకు మహర్దశ.. అప్పుల నుంచి విముక్తి!

Published : Oct 03, 2026, 01:40 PM IST

Mercury Transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా పిలిచే బుధుడు త్వరలో రాశి మారనున్నాడు. బుధుడి సంచారం కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని లాభాలు తీసుకురానుంది. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ చూద్దాం.

PREV
16
బుధ సంచారంతో లబ్ధి పొందే రాశులు

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కారకుడిగా భావిస్తారు. జాతకంలో బుధుడు బలంగా ఉంటే ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వృత్తి పరమైన నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి. మిథున, కన్య రాశులకు అధిపతి అయిన బుధుడు నవంబర్ 13న తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 2 వరకు అక్కడే ఉంటాడు. బుధుడి కదలికల్లో వచ్చే ఈ మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కెరీర్, డబ్బు, వ్యాపారం, కుటుంబ సంబంధాల విషయంలో 5 రాశుల వారికి ఇది చాలా కలిసొచ్చే సమయం. మరి ఆ అదృష్ట రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.

26
కన్య రాశి

కన్య రాశికి అధిపతి బుధుడే కాబట్టి ఈ సంచారం వీరికి చాలా కీలకం. నవంబర్ 13 నుంచి డిసెంబర్ 2 వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆఫీసులో మీ టాలెంట్‌కు గుర్తింపు దక్కుతుంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారం, వ్యవసాయం, సొంత పనులు చేసుకునే వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలుపెట్టాలనుకునేవారికి ఇది సరైన సమయం. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది.

36
మీన రాశి

మీన రాశి వారి జీవితంలో ఈ సమయం కీలక మార్పులు తీసుకొస్తుంది. బుధుడు ఎనిమిదో ఇంట్లో సంచరించడం వల్ల మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనుల్లో కదలిక వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఊహించని విధంగా కొన్ని మంచి అవకాశాలు మీ సొంతం అవుతాయి. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు, లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేసేందుకు ఇది అనుకూలమైన సమయం. మొత్తానికి ఈ కాలం మీకు ప్రశాంతతను ఇస్తుంది.

46
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి నవంబర్ 13 నుంచి డిసెంబర్ 2 వరకు అన్ని విధాలా కలిసొస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సానుకూల మార్పులు చూస్తారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త పనులను ఉత్సాహంగా మొదలుపెడతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే ఛాన్స్ ఉంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. పాత అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.

56
మేష రాశి

బుధుడి సంచారం మేష రాశివారి ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. నవంబర్ 13 నుంచి డిసెంబర్ 2 వరకు డబ్బు పరంగా మంచి లాభాలు చూస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఆదాయం వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పాత అప్పులు తీర్చగలుగుతారు. ఆఫీసులో మీ కష్టానికి పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యమైన బాధ్యతలు తీసుకోవడం వల్ల మీపై గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న పాత గొడవలు సమసిపోయి ప్రశాంతత నెలకొంటుంది.

66
తుల రాశి

బుధుడు తుల రాశిలోనే సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. ముఖ్యంగా డబ్బు, కెరీర్ పరంగా సానుకూల మార్పులు ఉంటాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అదనపు బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా పూర్తి చేసి మీ సత్తా చాటుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories