Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి!

Published : Oct 03, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.10.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

తండ్రి తరపు బంధువులతో వివాదాలు చికాకు తెప్పిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవానుగ్రహంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

413
మిథున రాశి ఫలాలు

వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. కొత్త విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయటా అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

713
కన్య రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.

813
తుల రాశి ఫలాలు

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలలో ఆత్మీయుల సహాయ సహకారాలు ఉంటాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్నిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహాపరుస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు .కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు.

1213
కుంభ రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

Read more Photos on
click me!

Recommended Stories