
జోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచుగా మారిపోతూ ఉంటాయి. కొన్ని సవ్య దిశలో ప్రయాణం చేస్తే, మరి కొన్ని అపసవ్య దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి. నవంబర్ లో ... బుధ గ్రహం తిరోగమనం చేయనుంది. ఈ బుధ గ్రహ తిరోగమనం.. కొన్ని రాశుల వారికి చాలా మేలు చేయనుంది. మరి కొన్ని రాశులకు సమస్యలు తెచ్చి పెట్టనుంది. మరి, ఈ తిరోగమన ప్రభావం ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపించనుందో ఓ సారి తెలుసుకుందాం.....
బుధ గ్రహ తిరోగమనం కారణంగా మేష రాశి వారు తమ పాత స్నేహితులను కలుస్తారు. వారిని కలవడం వల్ల కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో సడెన్ గా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతోనే సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. భార్యభర్తల మధ్య అపార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ రాశివారు నవంబర్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి వారికి బుధుడి తిరోగమనం బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. దీని వల్ల పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ప్లాన్ ప్రకారం ఏం చేసినా... బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. నవంబర్ లో వీరికి చాలా అనుకూలంగా ఉండొచ్చు. కానీ... ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు, ఏదైనా ఖర్చులు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. శివ నామ స్మరణ చేయడం వల్ల సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
బుధుడి తిరోగమనం అందరి కంటే మిథున రాశి వారికే బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మంచి పురోగతి చూస్తారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఆచి తూచి వ్యవహరించాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుంటే సరిపోతుంది.
బుధుడు తిరోగమనం కారణంగా, కర్కాటక రాశి వారు నవంబర్ లో మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ కాలంలో కుటుంబ వివాదాలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే, నిద్ర లేకపోవడం లేదా అలసట కారణంగా సమస్యలు ఉండవచ్చు. రెగ్యులర్ గా శివాభిషేకం చేయించడం వల్ల ఇంకాస్త అనుకూలంగా ఉంటుంది.
సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో పాత స్నేహితులు లేదా సన్నిహితుల నుండి ఆకస్మిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. సామాజిక సంబంధాల కారణంగా మంచి అవకాశాలు వస్తాయి. అయితే, స్నేహితుల మధ్య అపార్థాల కారణంగా సంబంధంలో చీలిక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది మాట్లాడినా మీ మాటల్లో క్లారిటీ ఉండేలా చూసుకోవాలి.
బుధుడు తిరోగమనం కారణంగా కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు వారి కెరీర్‌లో మెరుగుదలను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా, మీరు పాత ప్రాజెక్టులపై పని చేయడం ప్రారంభిస్తారు. కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. కానీ మీ సీనియర్లతో ఏదైనా విషయంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కన్య రాశిలో జన్మించిన వారు ఈ కాలంలో ఓం బ్రహ్మ్ బృం బ్రహ్మ్ సహ బుధాయ నమః మంత్రాన్ని జపించాలి.
బుధగ్రహం తిరోగమన కదలిక కారణంగా తులా రాశి వారు విదేశాలకు సంబంధించిన అసంపూర్ణ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, ప్రయాణంలో అడ్డంకులు లేదా చట్టపరమైన విషయాలలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తులా రాశి వారు ఈ కాలంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు.
వృశ్చికరాశి వారు ఈ కాలంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే.. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. కొత్త వ్యక్తులను నమ్మే ముందు కాస్త జాగ్రత్త పడాలి. ఆవుకు ఆహారం తినిపించడం వల్ల ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది.
ధనస్సు రాశివారికి నవంబర్ లో చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి లాభాలు పొందుుతారు. పనిలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. అయితే... వివాహ జీవితం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. అందరితోనూ వీలైనంత వరకు మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. గొడవలకు దూరంగా ఉండాలి.
మకర రాశి వారికి బుధుడు తిరోగమనం కారణంగా వారి పనిలో మెరుగుదల కనపడుతుంది. పాత తప్పులను సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య కారణంగా సహోద్యోగులతో కొంత సమస్య ఉండవచ్చు. ఈ సమయంలో, మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో, మకర రాశిలో జన్మించిన వారు మట్టి పాత్రలో నీటిని నింపి తులసి మొక్కకు నైవేద్యం పెట్టాలి.
కుంభ రాశిలో జన్మించిన వారు, బుధుడు తిరోగమనం కుంభ రాశి వారికి ప్రయోజనాలు మోసుకు రానుంది. పిల్లలకు సంబంధించిన ఏదైనా శుభవార్త వింటారు. అయితే.. దాంపత్య జీవితంలో ఏవైనా సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు తగ్గడానికి కుంభ రాశిలో జన్మించిన వారు బుధుని మంత్రం "ఓం బ్రహ్మ బ్రిం బ్రహ్మ సహ బుధాయ నమః" జపించాలి.
మీన రాశి వారు ఈ కాలంలో ఇల్లు లేదా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని వలన మీ కుటుంబంతో మీ సంబంధం మరింత బలపడుతుంది. గొడవలకు దూరంగా ఉండాలి. ఆవులను ఆహారం తినిపించడం వల్ల ఏవైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంది.