Astrology: బుధుడి వక్ర గమనం.. ఆ రాశుల వారికి 70 రోజుల కుబేర యోగం!

Published : Jul 23, 2025, 02:06 PM IST

Astrology : జ్యోతిష్యం ప్రకారం గ్రహాలలో సౌమ్యుడుగా పేరున్న బుధుడు తిరోగమనం పయనించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి  తిరుగులేని అధికారంతో పాటు డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయట. బుధుడు వక్ర గమనం వల్ల ఏయే రాశుల వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందో చూద్దాం..

PREV
15
బుధుని వక్ర గమనం.. ఈ 4 రాశులకి రాజయోగం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు బుద్ధి, వాక్కు,  తర్కం, గణితం, వ్యాపారం, కమ్యూనికేషన్ వంటి విషయాలకు బాధ్యత వహించే గ్రహంగా పేరుంది. ప్రస్తుతం జూలై 18, 2025 నుండి ఆగస్టు 11, 2025 వరకు బుధుడు కర్కాటక రాశిలో వక్ర గమనంలో పయనించనున్నారు. ఈ స్థితిని "వక్రస్థితి" అని పిలుస్తారు. ఈ కాలంలో బుధుని ప్రభావం వల్ల కొన్ని రాశులకు రాజయోగం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ నాలుగు రాశులవారు శుభఫలితాలు, ఆర్థిక లాభాలు, స్థిర ఆలోచనలు, అవకాశాలు పొందగలరు. బుధుని వక్ర గమన ప్రభావంతో రాజయోగాన్ని పొందే ఆ నాలుగు రాశుల వివరాలు చూద్దాం.

25
మిథున రాశి

బుధుని వక్ర గమనం ప్రభావం మిథున రాశి వారికి అత్యధిక అనుకూలత చూపుతుంది. ఈ కాలంలో వారి కుటుంబ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం రంగాల్లో లాభాలు, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. కొత్త ఉద్యోగాలు, ఒప్పందాల ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడి, సొంత ఇల్లు, కొత్త పెట్టుబడులు వంటి కలలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే బంధువులలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సమస్యలు తొలగి, ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.  

35
కన్య రాశి

బుధుని వక్ర గమనం వల్ల కన్య రాశి వారికి రాబోయే 70 రోజులు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ, వివాహ సంబంధాలు మెరుగవుతాయి. వ్యక్తిగత, వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడి, బంధాలు బలపడుతాయి. అలాగే ఈ రాశి వారికి వ్యక్తిగత, వృత్తి జీవితంలో అభివృద్ధి, ప్రమోషన్, గౌరవం లభించవచ్చు. 

స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్నవారికి ఆటంకాలు తొలగి ఊహించని అవకాశాలు అందుతాయి. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. ఇది కష్టానికి లభించే ప్రతిఫలం. పెట్టుబడులు, వ్యాపారం ద్వారా లాభాలు, అచంచలమైన ధనం అందే అవకాశం ఉంది. మానసికంగా స్థిరత, ధైర్యం, కొత్త ఆలోచనలు చేరతాయి. ఈ కాలం కన్య రాశివారికి  ఒక సువర్ణ అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.

45
తుల రాశి

బుధుడి వక్ర గమనం వల్ల తుల రాశి వారికి శుభ ఫలితాలున్నాయి. ఈ 70 రోజులు వారి జీవితంలో పాజివిట్ టర్నింగ్ పాయింట్‌గా మారొచ్చు. ఉద్యోగంలో ఉన్నత పదవులు, ప్రమోషన్, కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగి, లాభాలు అధికంగా లభించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి విస్తరణ, కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల అవకాశాలు లభిస్తాయి. 

ప్రతికూల ఆలోచనలు తగ్గి, దైర్యంగా, సానుకూలంగా ముందడుగు వేయగలుగుతారు. కుటుంబంలో ఆరోగ్య సంబంధిత చిన్న ఇబ్బందులు ఉన్నా, అవి త్వరగా పరిష్కారమవుతాయి. ఇప్పటి వరకు గుర్తింపు లేక బాధపడుతున్న వారికి, ఇప్పుడు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఈ వక్రగమన కాలాన్ని మీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే.. ఇది మీకు విజయాల దారిగా మారుతుంది.

55
కుంభం

బుధుడు వక్ర గమనం వల్ల కుంభ రాశివారికి రాబోయే 70 రోజులు శుభప్రదంగా ఉంటాయి.  దీనివల్ల కుంభ రాశి వారికి పెద్ద ఎత్తున విజయాలు లభిస్తాయి. సమస్యాత్మక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇది ఉత్తమ సమయం. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఈ కాలంలో ఖర్చులు అదుపులో ఉంటాయి. వివిధ ఒప్పందాల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం పొందవచ్చు. వ్యాపార, పెట్టుబడులకు మంచి లాభాలుంటాయి. కొత్త ఉద్యోగం, పెట్టుబడుల ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. 

(గమనిక: ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష్య శాస్త్ర అంచనాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వ్యక్తిగత జాతకం, దశాభుక్తులు, గ్రహ స్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి ఈ జ్యోతిష్య ఫలితాలను ఒక మార్గదర్శిగా మాత్రమే పరిగణించాలి. మీకు ఏవైనా సందేహాలుంటే అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది)

Read more Photos on
click me!

Recommended Stories