జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుల ప్రభావం రాశి చక్రాలపై బలంగా పడుతుంది. కుజుడు త్వరలో తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందామా..
సెప్టెంబర్ 13న కుజుడు కన్య రాశి నుంచి తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 26 వరకు అక్కడే ఉంటాడు. మేష, వృశ్చిక రాశులకు అధిపతి అయిన కుజుడు మకరరాశిలో ఉచ్ఛస్థితిని, కర్కాటక రాశిలో నీచస్థితిని పొందుతాడు. ఈ గోచారం వల్ల కొన్ని రాశులవారు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా..
26
మేష రాశి
మేషరాశికి అధిపతి కుజుడు. కానీ తుల రాశి శత్రు రాశి కావడం వల్ల ఈ గోచారం సంబంధాలలో ఉద్రిక్తత, అపార్థాలు, వివాదాలకు దారితీయవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు లేదా నష్టాలు కూడా రావచ్చు. కడుపు లేదా మూత్ర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గి, చిరాకు పెరుగుతుంది.
36
కర్కాటక రాశి
కుజుడి బలమైన శక్తి వల్ల కుటుంబంలో ఉద్రిక్తత చోటుచేసుకోవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు లేదా గృహప్రవేశం వంటి కార్యక్రమాలు ఆలస్యం కావచ్చు. ఛాతీ, ఊపిరితిత్తులు లేదా గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. కర్కాటకం.. కుజుడి నీచ రాశి (గ్రహం బలహీనంగా ఉండే స్థానం) కాబట్టి ఈ ప్రభావం మరింత క్లిష్టంగా ఉండవచ్చు.
ఈ సమయంలో తుల రాశివారికి చిరాకు, కోపం ఎక్కువగా ఉంటుంది. ఇది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి దారితీయవచ్చు. మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుంది. తలనొప్పి, అధిక రక్తపోటు లేదా గాయాల ప్రమాదం ఉండవచ్చు. జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో వివాదాలు జరగవచ్చు.
56
మకర రాశి
మకర రాశివారికి ఉద్యోగంలో అధిక ఒత్తిడి, ఉన్నతాధికారులతో విభేదాలు లేదా పోటీలో ఇబ్బందులు ఎదురవుతాయి. కీళ్ల నొప్పులు లేదా అలసట వంటి సమస్యలు రావచ్చు. కుజుడి గోచారం అత్యాశను పెంచుతుంది. దానివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
66
మీన రాశి
కుజుడి రాశిమార్పు.. మీన రాశివారికి ఆర్థిక నష్టాలు, అనవసర ఖర్చులు లేదా పెట్టుబడులలో నష్టాలకు దారితీయవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆకస్మిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్తం లేదా కండరాలకు సంబంధించినవి రావచ్చు. మీనరాశి అధిపతి గురువు, కుజుడు స్నేహితులు. కానీ తుల రాశిలో కుజుడి నీచస్థితి వల్ల మీనరాశిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.