జోతిష్యం మాదిరిగానే.. న్యూమరాలజీ కూడా మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈ న్యూమరాలజీ ప్రకారం మన భవిష్యత్తు మాత్రమేకాదు.. కెరీర్ , ప్రేమ, వైవాహిక జీవితం, ఉద్యోగం అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. మరి, నెంబర్ 2 కి చెందిన వారి లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..
25
Number 2
ఏనెలలో అయినా 2, 11, 20 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం, ప్రేమ జీవితం విషయానికి వస్తే... వీరు ఇతరుల కంటే కొంచెం భిన్నంగా ఉంటారు. వీరి ప్రవర్తనతో ఇతరులను చాలా సులభంగా ఆకర్షించగలరు. వీరికి తెలివి తేటలు కూడా చాలా ఎక్కువ. ఈ తేదీల్లో జన్మించిన వారు తమ ఎదుటి వ్యక్తి మంచివారా, చెడ్డవారా అనే తేడాను చాలా సులభంగా పరిష్కరించగలరు. మంచికీ, చెడుకీ తేడా వీరికి బాగా తెలుసు.ఇతరుల పట్ల చాలా సానుభూతితో ఉంటారు. మంచి ఆలోచనాపరులు. మంచి శ్రోతలు కూడా. ఇతరులు చెప్పేది చాలా శ్రద్ధగా వింటారు.
35
ప్రేమ జీవితం..
ప్రేమ విషయానికి వస్తే వీరు అంత గుడ్డిగా ఎవరినీ నమ్మరు. ఈ వ్యక్తులు ఎవరితోనూ సులభంగా మాట్లాడరు. వీరు ఎవరితో అయినా ప్రేమలో పడాలి అంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. పూర్తిగా నమ్మితే తప్ప.. వారితో బంధాన్ని ముందుకు తీసుకువెళ్లరు. ఒక్కసారి ప్రేమలో పడితే.. వారితో జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటారు. ప్రేమించిన వ్యక్తితో చాలా అంకితభావంతో ఉంటారు. ప్రేమ, సంరక్షణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వారి ఈ స్వభావం వారి భాగస్వామితో బాగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.కొన్నిసార్లు ప్రేమ సంబంధాలలో వారు మోసపోవచ్చు.కానీ అలా అని బాధపడుతూ కూర్చోరు. తమకు సరిపోయే జీవిత భాగస్వామి దొరికే వరకు ఎదురు చూస్తారు.
నెంబర్ 2 కి చెందిన వ్యక్తుల ప్రేమ సంబంధాల విషయానికి వస్తే, వారు ప్రేమ సంబంధాలలో వారి ఆత్మగౌరవాన్ని పదే పదే తగ్గించుకోరు. వారు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వారి జీవితాల్లో ప్రతిదీ ఎల్లప్పుడూ బాగానే జరుగుతుంది.ఈ వ్యక్తులు ఎవరికీ తలవంచరు. వారి సంబంధాలలో ఎల్లప్పుడూ దృఢంగా ఉంటారు. వారి ఈ స్వభావం ఎల్లప్పుడూ వారి గౌరవాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.వారిపై వారికి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది.
55
తెలివైన వారు..
ఈ తేదీల్లో జన్మించిన వారు.. ఇతరుల మనసులోని భావాలను కూడా చాలా సులభంగా అంచనా వేయగలరు. ఆ తెలివి తేటలు వీరికి చాలా ఎక్కువ. వీరి మనసు ఎంత మంచిది అంటే... తమ భాగస్వామి ఏదైనా సమస్యలో చిక్కుకుంటే వారి ఖర్మకు వారిని వదిలేయరు.వారి సమస్యను దగ్గరుండి మరీ వీరే పరిష్కరించేస్తారు.