జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు, శుక్ర గ్రహాలు మేష రాశి మూడో ఇంట్లో ఉండటం, గురువు ఏడో ఇంటిపై దృష్టి వేయడంతో పరిచయస్తులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహం జరిగే అవకాశం ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తే మంచి సంబంధం కుదురుతుంది. వరుడు లేదా వధువు ధనవంతుల కుటుంబానికి చెందినవారై ఉండవచ్చు. పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం.