Chanakya Niti: ఈ రోజుల్లో బతకాలంటే ఈ ఐదు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

Published : Aug 08, 2025, 02:03 PM IST

ఈ రోజుల్లో నీకు నిజంగా ఏదైనా తెలిస్తే, నీలో టాలెంట్ ఉంటే.. అది నువ్వే చెప్పుకోవాలి.. లేకపోతే ఆ విషయం నీకు తెలుసనే విషయం ఎవరికీ తెలియదు.

PREV
16
చాణక్య నీతి ఏం చెబుతోంది?

నిండు కుండ తునకదు.. ఈ సామేత చిన్నప్పుడు వినే ఉంటారు. అంటే.. అన్నీ తెలిసిన వాళ్లు.. నిండు కుండలా ప్రశాంతంగా ఉంటారు. పూర్తిగా తెలియని వాళ్లు.. తమకు తెలిసినట్లు బిల్డప్ ఇస్తూ ఉంటారు అని ఈ సామేత అర్థం. చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు, ఇంట్లో పేరెంట్స్ మనకు ఈ విషయాన్ని చెబుతూ వచ్చారు. నీకు ఏదైనా విషయం తెలిస్తే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నిండు కుండలాగా ఉండాలి అని చెబుతూ వచ్చారు. కానీ.. ప్రస్తుత కాలంలో మాత్రం ఈ సామేత ఏ మాత్రం పనికి రాదని.. చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. ఈ రోజుల్లో నీకు నిజంగా ఏదైనా తెలిస్తే, నీలో టాలెంట్ ఉంటే.. అది నువ్వే చెప్పుకోవాలి.. లేకపోతే ఆ విషయం నీకు తెలుసనే విషయం ఎవరికీ తెలియదు. మరి, చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్న దాని ప్రకారం.. మనిషి అనేవారు ఎలా ఉండాలి? ఎలా ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

26
1.గౌరవం పొందాలంటే మంచిగా ఉంటే సరిపోదు...

ఒకప్పుడు మంచివారిగా ఉంటే చాలు.. వారు కోరుకున్న గౌరవం వారికి దక్కేది. కానీ.. ఇప్పుడు మంచితనం నిర్వచనం మారిపోయింది. ఇతరుల పట్ల నిజాయితీగా ఉండటం, ఉదారంగా ఉండటం, ఇతరులకు ఎప్పుడూ సహాయం చేయడం చేస్తే సరిపోదు. మొదట మనకు మనం సహాయం చేసుకోవాలి. మన్నలి మనం ప్రేమించుకోవాలి. మనతో మనం నిజాయితీ గా ఉండాలి. ముందు మనల్ని మనం గౌరవించుకుంటే.. ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది.

36
2. అందరికీ అందుబాటులో ఉండకూడదు..

అందరికీ అందుబాటులో ఉంటే.. ఇతరులకు లోకువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చాణక్యుడు చెబుతున్నాడు. చాలా మంది తమపై ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ భారాన్ని మీపై వేసే అవకాశం ఉంది. అందుకే.. ప్రతిసారీ అందరికీ అందుబాటులో ఉండకూడదు. అంతేకాదు ఇతరుల బరువు, బాధ్యలతలను మీ తలపై ఎత్తుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు. అలా అని ఇతరులకు సహాయం చేయకుండా ఉండమని కాదు... మీకు తోచినంత సహాయం మాత్రమే చేయాలి. పూర్తి బాధ్యతలు తీసుకోకూడదు. అలా మీరు వారి బాధ్యతలు మోయడం మొదలుపెడితే.. వాళ్లు మిమ్మల్ని అవసరానికి వాడుకోవడం మొదలుపెడతారు.

46
3.మీ ప్రయోజనాల గురించి ఆలోచించండి

ఒకరికి హాని చేయడం ద్వారా మీరు ప్రయోజనం పొందడం మంచిది కాదు. మనం మన గురించి ఆలోచించినప్పుడల్లా, ఈ విషయం గుర్తుకు వస్తుంది. కానీ మీ నష్టం కూడా ఎవరికైనా ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి, ఎల్లప్పుడూ మొదట మీ ప్రయోజనం గురించి ఆలోచించండి. మీకు ఎలాంటి ప్రయోజనం లేని పని చేసి.. దాని ద్వారా ఇతరులకు నష్టం కలిగించడం అనేది చాలా పెద్ద తప్పు. కానీ..మీ ప్రయోజనం కారణంగా ఎవరైనా హాని పొందుతుంటే, మీరు దాని గురించి ఆలోచించి సమయం వృథా చేయాల్సిన అవసరం లేదు.

56
ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం మానేయండి

మీరు ఇతరులను ఎందుకు సంతోషపెట్టాలి? మీ ఆనందం గురించి ఆలోచించండి. మీరు సంతోషంగా ఉంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సంతోషంగా ఉంచగలుగుతారు. మీరు ఎంత మంచి పని చేసినా, ప్రజలు మీ నుండి ఆశించేవి ఎప్పటికీ తగ్గవని అర్థం చేసుకోండి. మీరు 7 మెట్లు దాటితే, ప్రజలు మిమ్మల్ని 10వ మెట్టు ఎక్కాలని కూడా కోరుకుంటారు. కాబట్టి మిమ్మల్ని సంతోషపెట్టే పని చేయండి.

66
మీ హక్కుల కోసం మాట్లాడండి..

ఈ రోజుల్లో ఎవరైనా తమ పని వదిలేసి.. ఇతరుల హక్కుల కోసం పోరాడతారు అనుకుంటే అది పొరపాటే. ఎవరి కోసం ఎవరూ రారు. కాబట్టి.. మీ హక్కుల కోసం మీరే పోరాడాలి. మిమ్మల్ని మీరు బలహీనులుగా ఎప్పుడూ భావించకండి. ఎందుకంటే తరచుగా తమను తాము బలహీనులుగా భావించి తమ కోసం నిలబడలేని వ్యక్తులకు ఎలాంటి హక్కులు ఉండవు. ఎవరో ఒకరు ఆ హక్కులను లాగేసుకుంటారు. కాబట్టి.. మీ కోసం మీరు నిలపడడండి.

Read more Photos on
click me!

Recommended Stories