మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి కూడా విఘ్నేశ్వరుడికి ఇష్టమైనది. ఈ రాశివారు మంచి మాటకారులు. చురుకుగా ఉంటారు. అద్భుతమైన తెలివితేటలు వీరి సొంతం. గణేశుడి అనుగ్రహంతో ఈ రాశివారి కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా ఫాస్ట్ గా ఉన్నత స్థానాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.