Astrology: మూడు రోజులు ఓపిక ప‌డితే చాలు.. ఈ 5 రాశుల వారి జీవితం మార‌నుంది

Published : May 28, 2025, 07:21 PM ISTUpdated : May 28, 2025, 07:23 PM IST

గ్ర‌హాల చ‌ల‌నంలో మార్పులు మ‌నిషి జ్యోతిష్యంపై ప్ర‌భావం చూపుతుంద‌ని పండితులు చెబుతుంటారు. వ‌చ్చే నెల‌లో ఇలాంటి మార్పు రానుంది. జూన్‌లో సూర్యుడు, బృహస్పతి ఒకే రాశిలోకి వ‌స్తుండ‌డంతో 5 రాశుల‌పై ప్ర‌భావం చూప‌నుంది.

PREV
16
అరుదైన శుభయోగం

జూన్ నెలలో సూర్యుడు, బృహస్పతి ఒకే రాశిలోకి చేరుతుండటంతో, ఒక అరుదైన శుభయోగం ఏర్పడుతుంది. ఈ గ్రహాల సంచారం 12 రాశులపై ప్రభావం చూపించనుంది. అయితే ఐదు రాశుల వారికి మాత్రం ఇది అఖండ రాజయోగంలా పనిచేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదృష్టం, ఆర్థిక లాభాలు, పదోన్నతులు, శుభవార్తలతో జీవితం వెలిగిపోతుందని చెబుతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో చూద్దాం.

26
కన్యా రాశి:

క‌న్యా రాశి వారికి జూన్‌లో మంచి రోజులు రానున్నాయి. ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతి క‌ల‌గ‌నుంది. సూర్యుడు, బృహస్పతి కలిసి మీ రాశిపై అనుకూల ప్రభావంచూపిస్తుంది. పెట్టుబడులకు అధిక రాబడులు, ఆర్థికంగా స్థిరత ల‌భిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెల‌కొంటుంది. ఉద్యోగాలలో పదోన్నతులు, అన్ని విషయంలో విజయాలు సాధిస్తాయి.

36
మ‌క‌ర రాశి:

ఆస్తుల వృద్ధి, సంబంధాల్లో మెరుగుదల క‌నిపిస్తుంది. ఈ గ్రహాల సంయోగం వీరి జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సంబంధాలు బలపడతాయి, ఉద్యోగస్తులకు ప్రశంసలు ల‌భిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో, బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది.

46
తుల రాశి:

సంపదల వృద్ధి, మొండి బాకీల రికవరీ అవుతాయి. ఈ సమయంలో తుల రాశి వారికి శుభయోగాలు క్రమంగా చేకూరుతాయి. వసూలు కాని బాకీలు తిరిగి వ‌స్తాయి. సంపద రెట్టింపు అవుతుంది, ఆర్థిక పురోగతి, కుటుంబంలో ఆనందం ల‌భిస్తుంది. వ్యాపారవర్గాలకు లాభదాయకంగా ఉంటుంది.

56
మీన రాశి:

ఈ రాశి వారికి కొత్త అవకాశాలు, పదోన్నతులు ల‌భిస్తాయి. మీ రాశిలో అనేక అనుకూల ఫలితాలు కనబడతాయి. కొత్త వ్యాపార ప్రారంభించే అవ‌కాశం ఉంది. కెరీర్‌లో పదోన్నతి, కుటుంబంలో శాంతి నెల‌కొంటుంది. బాకీలు వ‌సూలు అవుతాయి.

66
కర్కాటక రాశి:

ఈ రాశి వారికి వ‌చ్చే నెల‌లో ఆర్థిక సమృద్ధి, ఉద్యోగ అవకాశాలు ల‌భిస్తాయి. ఈ గ్రహాల సంయోగం మీకు గొప్ప విజయాల దారితీస్తుంది. డబ్బు సమృద్ధిగా ల‌భిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వ‌స్తాయి. ఉద్యోగ అవకాశాలు ల‌భిస్తాయి. బంగారం, వెండి, రిల‌య్ ఎస్టేట్ వ్యాపారుల‌కు అదృష్టం వ‌రిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories