Mercury Transit: బుధుడి సంచారం.. ఈ 3 రాశులకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!

Published : May 28, 2025, 04:12 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం కాలానుగుణంగా నక్షత్ర రాశులను మారుస్తుంది. మే 29 న బుధ గ్రహం శుక్ర నక్షత్రంలో సంచరించనుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. బుధుడి సంచారం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో ఇక్కడ చూద్దాం.

PREV
14
బుధుడి సంచారం

బుధుడిని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడి సంచారం చాలా ముఖ్యమైంది. సాధారణంగా బుధుడు తక్కువ వ్యవధిలోనే నక్షత్రరాశులను మారుస్తుంటాడు. మే 29న బుధుడు శుక్ర నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ ప్రభావం వల్ల 3 రాశులవారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం.

24
సింహ రాశి

సింహ రాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం శుభప్రదం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి సమయం. ఊహించని లాభాలు అందుకుంటారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

34
మిథున రాశి
మిథున రాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం మంచి అవకాశాలు తెస్తుంది. కుటుంబం, స్నేహితులతో బంధం బలపడుతుంది. ఉద్యోగ సంబంధిత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
44
మేష రాశి

మేష రాశి వారికి బుధ గ్రహ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. స్నేహితుల సహకారంతో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో సంతోషం, ప్రేమ పెరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories