Saturn Transit: శని వక్రగమనం..జులై లో ఈ మూడు రాశుల లైఫ్ మారిపోయినట్లే..!

Published : Jun 30, 2025, 05:24 PM IST

బుధుడు, శుక్రుడు, కుజుడు కూడా తమ స్థానాలను మార్చుకోనున్నారు. ఈ మార్పులన్నీ.. జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశులపై చాలా ఎక్కువ ప్రభావం చూపించనుంది. 

PREV
14
గ్రహాల తిరోగమనం..

జులై నెలలో గ్రహాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. జులై 9 వ తేదీన గురు గ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తుండగా.. జులై 13వ తేదీన శని మీన రాశిలోకి వక్రగమనంలోకి వెళ్లనున్నాడు. అదేవిధంగా సూర్యుడు జులై16న కర్కాటక రాశిలోకి అడుగుపెడతాడు. వీటితో పాటు.. బుధుడు, శుక్రుడు, కుజుడు కూడా తమ స్థానాలను మార్చుకోనున్నారు. ఈ మార్పులన్నీ.. జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశులపై చాలా ఎక్కువ ప్రభావం చూపించనుంది. వాటిలో ముఖ్యంగా.. వృషభ, మేష, వృశ్చిక రాశుల వారికి అనుకోని ధన లాభాలు, పురోగతి, శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా...

24
1.వృషభ రాశి... ఆశించని అనుభూతులకు సిద్ధంగా ఉండండి..

జులై నెల వృషభ రాశి వారికి కొత్త వెలుగు చూపించనుంది. గత కొన్ని నెలలుగా ఎదురౌతున్న సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి అభివృద్ధి చూస్తారు.గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ జులై నెలలో మీరు చేసే ప్రతి పనీ విజయం అయ్యే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. దాంపత్య జీవితంలో ప్రేమాభివృద్ధి చోటుచేసుకుంటుంది. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. కానీ.. వాటిని కూడా మీరు ఆనందంగా, విజయవంతంగా నిర్వహించగలరు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

34
2.మేష రాశి – అవకాశాల ఉత్సవం మొదలవుతోంది..

గ్రహాల అనుకూలతతో మేషరాశి వారికి జులై నెల మంచి శుభకాలంగా మారనుంది. ఈ నెలలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతం అవుతుంది. వృత్తిపరంగా గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శాంతి , అనురాగ వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి.

44
3.వృశ్చిక రాశి – ఆర్థిక ప్రగతి & వ్యాపారంలో విజయం..

వృశ్చిక రాశి వారికి జులై నెల గణనీయమైన మార్పులకు నాంది పలుకుతుంది. గ్రహాలలో మార్పుల ప్రభావంతో మీకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. గతంలో పెట్టుబడి పెట్టిన విషయాలు ఇప్పుడు లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మేలు చేస్తుంది. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధాలు బలపడతాయి. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి వ్యయాలలో నియంత్రణ అవసరం.

ఫైనల్ గా..

ఈ జులై నెలలో గ్రహాల సంచార ఫలితంగా కొందరికి అనుకోని లాభాలు, అవకాశాలు, ప్రేమ సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు పై చెప్పిన మూడు రాశులలో ఒకరిగా ఉంటే, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. గ్రహ అనుగ్రహంతో మీ జీవితం కొత్త దిశలో పయనించబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories