జనవరిలో అతి ముఖ్యమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శుక్రుడు కలయిక వల్లే ఈ రాజయోగం ఏర్పుడుతుంది. సూర్యుడు నాయకత్వాన్ని, అధికారాన్ని అందిస్తాడు. ఇక శుక్రుడు సంపదను, సుఖాలను ఇస్తాడు. ఇక ఈ ఇద్దరూ కలిసి ఏర్పరచే రాజయోగం వల్ల అధికారం, సంపద కలిసివస్తాయి. ఈ రెండు గ్రహాలు కలిపి ఒక వ్యక్తి జీవితంలో గౌరవం, సుఖం, డబ్బు పెరుగుతుంది. ఇక ఈ జనవరిలో మకరరాశిలో సూర్యుడు, శుక్రుడు కలవబోతున్నారు. దీని వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడి ఫిబ్రవరి 5 వరకు ఉంటుంది. ఈ యోగం 3 రాశుల వారికి విపరీత లాభాలను అందిస్తుంది. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.