Vastu Tips: 2026 లో సంతోషానికి, డబ్బుకి లోటు ఉండకూడదంటే... ఇంటికి ఇవి తేవాల్సిందే

Published : Nov 10, 2025, 03:37 PM IST

 Vastu Tips: మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభమౌతోంది. ఈ కాలంలో సంపద, శ్రేయస్సు పెరగాలని కోరుకుంటే, వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలి. 

PREV
15
Vastu tips

వాస్తు మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ వాస్తు ప్రకారం మనం తెలీక చేసే తప్పులు.. మన జీవితాలను సమస్యల్లోకి నెట్టేస్తాయి. అందుకే.. ఎప్పటికప్పుడు వాస్తు మార్పులు చేసుకోవాలి. 2025 సంవత్సరం కొన్ని రోజుల్లో ముగుస్తోంది. కాబట్టి, 2026 నూతన సంవత్సారాన్ని సంతోషంగా, సంపన్నంగా మార్చుకోవడానికి, మీరు ఈ నవంబర్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. నవంబర్ లో ఏం తెస్తే... మీ జీవితం ఆనందంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం....

25
శ్రీ యంత్రం...

శ్రీ యంత్రం అనేది సంపద, శ్రేయస్సు, ఆనందాన్ని సూచించే శక్తివంతమైన చిహ్నం. ఈ శ్రీయంత్రాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. అందుకే, శ్రీ యంత్రాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల కొత్త సంవత్సరంలో మీ ఇంటికి సానుకూలత, శాంతి చేకూరతాయి. మీరు ఈ శ్రీయంత్రాన్ని మీ ఇంటి పూజ గదిలో పెట్టొచ్చు. లేదంటే... ఈశాన్య దిక్కులో... పసుపు లేదా ఎరుపు వస్త్రంలో చుట్టి అయినా ఉంచొచ్చు.

35
శివలింగం....

2026 మొదలుకావడానికే ముందే... మీ ఇంటికి శివ లింగం తీసుకురావాలి. శివలింగాన్ని మీ ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. వాస్తు దోషాలు ఏమి ఉన్నా తొలగిపోతాయి. అది కూడా సాధారణ శివలింగం కాకుండా.. పాదరసంతో చేసిన శివలింగాన్ని తయారు చేసినదానిని తీసుకురావడం వల్ల.. మీ ఇంట్లో గొడవలు, కోపాలు తగ్గిపోతాయి. ఈ శివయ్యను పూజిస్తూ ఉంటే... ఆ శివయ్య ఆశీస్సులు మీరు కచ్చితంగా పొందుతారు.

45
క్రిస్టల్ బాల్...

పైరేట్ క్రిస్టల్ బాల్ అనేది బంగారంలా మెరిసే సామర్థ్యం కలిగిన ఒక రకమైన రాయి. కొంతమంది దీనిని బంగారం అని కూడా పిలుస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ పదార్థం ఇంట్లో చాలా డబ్బు , సంపద రాకను సూచిస్తుందని చెబుతారు. కాబట్టి, ఈ పైరేట్ క్రిస్టల్ బాల్‌ను ఇంట్లో ఉంచుకోవడం వల్ల డబ్బు ,సంపదను ఆకర్షించవచ్చు. దీని కారణంగా, మీరు వ్యాపారంలో ఎక్కువ లాభం పొందుతారు. శుభ ఫలితాలు పొందుతారు.

55
స్వస్తిక్ యంత్రం...

స్వస్తిక్ చిహ్నం హిందూ మతానికి చాలా పవిత్రమైన , శుభప్రదమైన చిహ్నం. కాబట్టి, ఇంట్లో స్వస్తిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే, అవన్నీ తొలగిపోయి ఇంట్లో ఆనందం , శ్రేయస్సు వెల్లివిరుస్తుందని కూడా చెబుతారు. అందువల్ల, ఈ స్వస్తిక్ యంత్రాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా దుకాణం ప్రధాన ద్వారం దగ్గర, వాహనంలో లేదా నగదు పెట్టె దగ్గర ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని చెబుతారు. అందువల్ల, మీ ఇంట్లో ఎరుపు రంగు స్వస్తిక్ చిహ్నం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories