మనిషి శాస్త్ర సాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాటిలో గుర్రపు నాడా ఒకటి. దీనిని సరైన విధానంలో ఉపయోగిస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. .
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇనుము శనిదేవునికి ప్రీతిపాత్రమైన లోహం. ఇంటి ప్రధాన ద్వారం పైన ఇనుముతో చేసిన గుర్రపు నాడాను వేలాడదీయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం ఉంది. ఇది వాస్తు దోషాలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇంట్లో శుభం, సౌఖ్యం నెలకొంటాయని భావిస్తారు.
25
వ్యాపార విజయానికి
గుర్రపు నాడాతో తయారైన ఉంగరాన్ని మధ్యవేలికి ధరించడం లేదా వ్యాపార స్థలంలో అమర్చుకోవడం వల్ల పనుల్లో విజయం, వ్యాపారంలో లాభం వస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. ముఖ్యంగా కొత్త వ్యాపారం ప్రారంభించే వారు ఈ పద్ధతిని పాటిస్తే అదృష్టం కలుస్తుందని నమ్మకం.
35
ఆర్థిక బలానికి గుర్రపు నాడా
సంపదలో స్థిరత్వం రావాలని కోరుకునే వారు గుర్రపు నాడాను పర్సులో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సంపద నిలుస్తుందని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. కొందరు దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల సొమ్ము బయటకు పోకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు.
గుర్రపు నాడాను అమర్చే ముందు గంగాజలంతో లేదా నది నీటితో శుద్ధి చేయాలి. ఎండలో ఉంచి సూర్యకిరణాల శక్తిని గ్రహింపజేయాలి. తరువాత లక్ష్మీదేవి ముందు పూజ చేసి ప్రధాన ద్వారం పైన అమర్చాలి. సాధారణంగా చివర్లు పైకి ఉండేలా ఉంచడం అదృష్టం, సంపదను ఆకర్షిస్తుందని అంటారు. కొందరు చివర్లు కిందకు ఉండేలా అమర్చితే కూడా మంచిదని అంటుంటారు.
55
ఏ నాడాను ఎంచుకోవాలి?
ప్లాస్టిక్ లేదా ఇతర పదార్థాలతో తయారు చేసిన నకిలీ గుర్రపు నాడాలకు జ్యోతిష్యంలో ప్రాముఖ్యత ఇవ్వరు. నిజమైన ఇనుముతో, గుర్రం ధరించిన నాడానే శక్తివంతంగా ఉంటుందని నమ్మకం. దానిని ఉపయోగించినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.