Hanuman Chalisa: హ‌నుమాన్ చాలీసాలో ఈ శ్లోకం చదివితే చాలు.. కోరికలు నెరవేరుతాయి, కష్టాలు తగ్గిపోతాయి

Published : Oct 02, 2025, 02:03 PM IST

Hanuman Chalisa: హనుమాన్ చాలీసా పఠనం ద్వారా శక్తి, భక్తి, జ్ఞానం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమాన్ చాలీసాలో మొత్తం 40 చౌపాయిలు ఉన్నాయి. ఒక్కో చౌపాయికి ఒక్కో అర్థం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
కోరికలు నెరవేరడానికి

చౌపాయి – “ఔర మనోరథ్ జో కోయి లావై, సోయి అమిత జీవన్ ఫల్ పావై”

అర్థం – ఎవరు ఏ కోరికతో హనుమంతుడిని ప్రార్థిస్తారో, వారికి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అది జీవితాంతం నిలిచే ఫలితాన్ని ఇస్తుంది.

25
పనుల్లో అడ్డంకులు తొలగేందుకు

చౌపాయి – “భీమ్ రూప ధరి అసుర సంహారే, రామచంద్ర కే కాజ సవారే”

అర్థం – హనుమంతుడు భీమ్ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు. అలా శ్రీరాముడి పనులను సఫలీకృతం చేశారు. ఈ చౌపాయి జపం ద్వారా మన పనుల్లోని అడ్డంకులు తొలగిపోతాయి.

35
భయాన్ని తొలగించడానికి

చౌపాయి – “భూత్ పిశాచ నికట్ నహి ఆవై, మహాబీర్ జబ్ నామ్ సునావై”

అర్థం – హనుమంతుని పేరు వినగానే భూతాలు, పిశాచాలు దగ్గరకి రావు. ఆయన పేరులోనే అపార శక్తి ఉంది. ఈ చౌపాయి పఠనం ద్వారా భయం దూరమవుతుంది.

45
విద్యార్థులకు జ్ఞానం కలిగేందుకు

చౌపాయి – “బల్ బుద్ధి బిద్యా దేహు మోహి, హరహు క‌లేస బికార”

అర్థం – హనుమంతుడు శక్తి, బుద్ధి, విద్య ప్రసాదించి అన్ని కష్టాలు తొలగిస్తాడు. ఈ చౌపాయి విద్యార్థులకు విశేష ఫలితాలు ఇస్తుంది.

55
రోగాలు, బాధలు దూరం కావడానికి

చౌపాయి – “నాసై రోగ హరే సబు పీరా, జపత్ నిరంతర హనుమత్ వీరా”

అర్థం – హనుమంతుని నామస్మరణ చేయడం ద్వారా అన్ని రకాల రోగాలు, బాధలు తొలగిపోతాయి. ఈ చౌపాయి నిరంతరం జపిస్తే ఆరోగ్యం, ఉల్లాసం లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories