న్యూమరాలజీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, ఇష్టాలు, ఇతర విషయాల గురించి తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తను అమ్మలా ప్రేమిస్తారట. వీరి ప్రేమకు అత్త ఫిదా అయిపోతుందట. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇలా ఉంటారో ఇక్కడ చూద్దాం.
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టినవారు అత్తను ప్రేమిస్తారు?
సాధారణంగా అత్తా, కోడళ్లకు అస్సలు పడదంటారు పెద్దలు. వారు ఇద్దరు ఒక దగ్గర ఉంటే గొడవలు తప్పవని చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా చోట్ల తల్లి, కూతుళ్లలా ఉండే అత్తా కోడళ్లని మనం చూస్తూనే ఉన్నాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తను అమ్మలా ప్రేమిస్తారట. ఎలాంటి అత్త అయినా వీరి ప్రేమకు ఫిదా అయిపోతుందట. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇలా ఉంటారో ఓసారి చూద్దామా..
24
3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు..
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మంచి స్వభావం కలిగి ఉంటారు. అత్తారింట్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా అత్తను మంచిగా చూసుకుంటారు. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టినవారు.. గురు గ్రహం ప్రభావం వల్ల అత్తింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు.
34
వీరి స్వభావం ఎలా ఉంటుందంటే?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వీరి ప్రవర్తనతో అత్త మనసుని సులువుగా గెలిచేస్తారు. వీరిని కుటుంబంలోని అందరూ ప్రేమగా చూసుకుంటారు. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తారింటికి సిరి సంపదలను మోసుకువస్తారు. వాళ్లు వచ్చాకే ఇంట్లో సంపద, సంతోషం పెరుగుతాయి.
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా పాజిటివ్ గా ఉంటారు. వీరి వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. వీరి ప్రశాంత స్వభావం వల్ల భర్తతో, కుటుంబంతో గొడవలకు దూరంగా ఉంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోతారు. కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు.