Birth Date: నెలలో ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు ఎవరి హృదయాన్ని అయినా ఇట్టే గెలిచేస్తారు

Published : Nov 02, 2025, 01:14 PM IST

Birth Date: న్యూమరాలజీలో ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన అమ్మాయిలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. వారు ఎవరి హృదయాలనైనా ఇట్టే గెలిచేస్తారు. 

PREV
15
న్యూమరాలజీ స్పెషాలిటీ

న్యూమరాలజీలో ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి స్వభావం, ఆలోచన, వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటాయని చెబుతోంది. పుట్టిన తేదీలలో రహస్యాలు ఎన్నో దాగి ఉంటాయని, ఆ వ్యక్తి జీవిత దిశను కూడా అవి నిర్ణయిస్తాయని చెబుతోంది. అలా కొన్ని తేదీలలో పుట్టిన అమ్మాయిల గురించి ఇక్కడ ఇచ్చాము. ఎవరి మనసునైనా ఇట్టే గెలుచుకునే సామర్థ్యం ఉన్నా అమ్మాయిలు ఏ తేదీలలో జన్మించారో తెలుసుకోండి.

25
రాడిక్స్ సంఖ్య 2

న్యూమరాలజీలో రాడిక్స్ అంకెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్నే మూల సంఖ్య అంటారు. పుట్టిన తేదీలోని అన్ని అంకెలను కలిపితే వచ్చేదే రాడిక్స్ సంఖ్య. ఈ రాడిక్స్ సంఖ్యను బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. అలాగే ఏ గ్రహంతో ఆ వ్యక్తి జీవితం ముడిపడి ఉంటుందో కూడా చెబుతారు. ఇప్పుడు మనం రాడిక్స్ సంఖ్య రెండు గురించి చెబుతున్నాము. రాడిక్స్ సంఖ్య రెండు కలిగిన అమ్మాయిలు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. వారితో మాట్లాడిన వారు ఎవరైనా కూడా ఇట్టే వారిపై ఇష్టాన్ని పెంచుకుంటారు.

35
ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు

ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన అమ్మాయిల రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యను పాలించేది చంద్రుడు. చంద్రుడికి మనసు, భావోద్వేగాలు, సున్నితత్వం వంటివి అధికంగా ఉంటాయి. చంద్రుని ప్రభావం వల్లే ఈ అమ్మాయిలు కూడా సున్నితంగా ఉంటారు. అంతే కాదు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరితో ఒక్కసారి స్నేహం చేస్తే ఇట్టే వారికి ఆకర్షితులవుతారు.

45
ఎంతో దయామయులు

రాడిక్స్ సంఖ్య 2 గల అమ్మాయిలు ఎంతో దయ గల వారు ఇతరుల బాధను చూడలేరు. వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వీరి స్వభావమే అందరి హృదయాలకు వీరికి దగ్గర చేస్తుంది. వీరికి సహజంగానే ఆకర్షణ శక్తి ఎక్కువ. భౌతికంగా అందంగా ఉన్నా, లేకపోయినా హృదయంలో మాత్రం ఎంతో అందంగా ఉంటారు. అందమైన మనసుతోనే అందరి హృదయాలను గెలిచేస్తారు. వీరి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. వీరితో ఎవరైనా ఇట్టే ప్రేమలో పడతారు.

55
ఈ రంగాల్లో రాణిస్తారు

రాడిక్స్ సంఖ్య రెండు కలిగిన అమ్మాయిలు ఎప్పుడూ కూడా కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కొత్త పనులు చేసేందుకు, కొత్త ప్రయత్నాలు చేసేందుకు ఇష్టపడతారు. కళలు, రచన, సంగీతం వంటి సృజనాత్మక రంగాలలో వీరికి మంచి పేరు వస్తుంది. వారి ప్రేమ జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. లోతైన భావోద్వేగాలు, నిజమైన ప్రేమ వారి జీవితంలో నిండి ఉంటుంది

Read more Photos on
click me!

Recommended Stories