Zodiac Signs: నవంబర్లో ఈ రాశుల వారికి అదృష్టం పట్టనుంది, ఆస్తి ఆదాయం అన్నీ దక్కుతాయి

Published : Nov 02, 2025, 07:52 AM IST

Zodiac Signs: నవంబర్ నెలలో కొన్ని రాశుల వారికి బీభత్సం కలిసిరాబోతోంది. వారు మట్టి ముట్టుకున్న బంగారమే అవుతుంది. ఆ నెలలో శుక్ర ఆదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల వారికి ఈ మేలు జరగబోతోంది. 

PREV
15
వృషభ

వృషభ రాశి వారికి  నవంబర్ నెల విపరీతంగా కలిసివస్తుంది. వారి జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. కాకపోతే పిల్లల గురించిఆందోళనగా అనిపిస్తుంది. నవంబర్ నెల మీకెంతో కలిసొచ్చే సమయం. ఈ నెల ద్వితీయార్థంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. 

25
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కూడా నవంబర్ నెల ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.  వారికి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి లాభాలు దక్కుతాయి. ఇతర ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఇంట్లో విలాసవంతమైన వస్తువులు కొనే అవకాశం ఉంది. వాటి కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి.

35
సింహ రాశి

సింహ రాశి వారికి నవంబర్ నెల ఎంతో శుభప్రదమైనదిగా చెప్పుకోవాలి.  వృత్తి పరంగా చేసే వ్యాపార ప్రయాణాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగం చేసే మహిళలకు ఇదెంతో కలిసొచ్చే అవకాశం. వీరి వైవాహిక జీవితం ఎంతో హాయిగా సాగుతుంది.

45
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి నవంబర్‌లో అన్నీ విధాలుగా కలిసివస్తుంది.  ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య సమస్యలను పట్టించుకోవాలి. వ్యాపారంలో ఎన్నో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి.

55
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి నవంబర్ నెల ఎన్నో అవకాశాలు తెచ్చిపెడుతుంది. తమ తెలివి తేటలతో సమస్యలు వచ్చినా తప్పించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ కూడా రావచ్చు. వ్యాపారంలో పోటీ ఉన్న తట్టుకుని నిలబడతారు. 

Read more Photos on
click me!

Recommended Stories