శని మీనరాశిలో ప్రత్యక్షంగా సంచరించడం వల్ల ఈ రాశి వారు అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు దక్కవచ్చు. వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. శని ఆశీర్వాదంతో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మొత్తానికి, నవంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే ఈ శని ప్రత్యక్ష సంచారం కొందరి జీవితాల్లో ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వం, కొత్త ఆరంభాలకు సంకేతంగా నిలుస్తుంది. ఈ కాలంలో శనిదేవుని కటాక్షం పొందేందుకు నియమం, సహనం, సేవాభావం పాటిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.