Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి ప్రసాదం.. తండ్రి, భర్తకు సంపద మోసుకొస్తారు..!

Published : Jul 12, 2025, 08:01 AM IST

మనం పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం, అదృష్టం, ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించగలం ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు.

PREV
15
birth date

ప్రతి ఒక్కరూ తమ జీవితం అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని చాలా కలలు కంటారు. కానీ, అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు.ముఖ్యంగా మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు అయితే పూర్తిగా మన కంట్రోల్ లో ఉండవు. అలాంటి వాటిలో ముఖ్యమైనవి జననం, మరణం. మనకు తెలియకుండానే జరిగిపోతాయి. ప్రస్తుతం జననం విషయానికి వస్తే.. మనం పుట్టిన తేదీ మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. మనం పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం, అదృష్టం, ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించగలం ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉండే అమ్మాయిల పుట్టిన తేదీల గురించి తెలుసుకుందాం..

25
అదృష్ట తేదీలు..

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 3, 7, 11, 21, 29 తేదీల్లో జన్మించిన వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్ముతారు. వీరికి విశేష శక్తులు కూడా ఉంటాయి. ఈ రోజుల్లో పుట్టిన వారు సహజంగా ఆకర్షణీయంగా, తెలివిగా ఉంటారు. వారు తమ జీవితం మాత్రమే కాకుండా, ఇతరుల జీవితాల్లో కూడా సానుకూల మార్పులు తెస్తారని కూడా నమ్ముతారు.

35
తండ్రులకు అదృష్టం తెచ్చే కుమార్తెలు

ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు తమ తండ్రులకు ఆర్థిక ప్రగతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారని నిపుణులు చెబుతున్నారు. వారు జన్మించిన తర్వాత తండ్రుల జీవితంలో ఉద్యోగ పురోగతి, కొత్త అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అనేక శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయట. ముఖ్యంగా ఆర్థికంగా డబ్బుకు కొదవ ఉండదు.

45
భర్తలకు శుభాన్ని తెచ్చే భార్యలు..

ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు వివాహానంతరం తమ భర్తలకు అదృష్టాన్ని తీసుకువస్తారని నమ్మకం. వ్యాపారవృద్ధి, ఉద్యోగ పురోగతి, కుటుంబంలో ఆనందం వంటి అంశాలపై వారు సానుకూల ప్రభావం చూపుతారు. వారు ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి శాంతి, సమృద్ధి పెరుగుతుందని కూడా నమ్ముతారు.

55
పాజిటివ్ ఎనర్జీ..

ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు వారి కుటుంబానికి అదృష్టంగా మారుతారు. వీరు పక్కన ఉంటే దురదృష్టం అనేది ఉండదు. ముఖ్యంగా వీరి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇదే పాజిటివ్ ఎనర్జీ తమ కుటుంబ సభ్యులకు అందించగలరు. అందరికీ సుఖ సంతోషాలు పంచిపెడతారు. వారు తమ తండ్రి, భర్త విజయాల్లో పరోక్షంగా సహాయపడతారు.

అనుభూతి, విశ్వాసం, ఆసక్తి

ఇది శాస్త్రీయంగా నిరూపణ కానప్పటికీ , ఈ నమ్మకం అనేకమంది జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. తమ పుట్టిన తేదీలోనే ఒక శక్తి ఉందని భావించి ఉత్సాహంగా జీవిస్తారు. మొత్తం మీద, 3, 7, 11, 21, 29 తేదీల్లో జన్మించిన అమ్మాయిలు కుటుంబానికి శుభాన్ని తీసుకురాగలిగే వారిగా, అదృష్ట లక్షణాలను కలిగినవారిగా సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories