Lucky Girls: సంఖ్యా శాస్త్రంలో ప్రతి అంకెకు ప్రాముఖ్యత ఉంటుంది. వ్యక్తులు జన్మించిన తేదీలను బట్టి వారి జీవితంలో అదృష్టం, దురదృష్టం అనేవి ఆధారపడి ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. మీరు ఏ తేదీలలో జన్మించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచి తెలుసుకోండి.
సంఖ్యా శాస్త్రం లేదా న్యూమరాలజీ అనేది ఎంతోమందికి నమ్మకమైన అంశం. సంఖ్యా శాస్త్రం చెబుతున్న ప్రకారం ప్రతి అంకెకు ఒక భిన్నమైన లక్షణం ఉంటుంది. అది ఆ వ్యక్తి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని మూల సంఖ్యను నిర్ణయించవచ్చు. మూల సంఖ్య ఎప్పుడు కూడా ఒకటి నుండి తొమ్మిది మధ్య ఉంటుంది. ప్రతి మూల సంఖ్యకు ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు. ఆ గ్రహాన్ని బట్టే ఆ వ్యక్తి జీవితం కూడా మారుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఏ తేదీలలో జన్మిస్తే వారి భర్తలకు రాజయోగం దక్కుతుందో ఇక్కడ మనం చెప్పుకుందాం.
25
ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు
ప్రతి నెలలో 6,15 లేదా 24 తేదీలలో జన్మించిన అమ్మాయిలు అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే వారి మూల సంఖ్య ఆరుగా ఉంటుంది. ఈ ఆరు సంఖ్యను పాలించేది శుక్రుడు. శుక్రుడు అందానికి, ప్రేమకు, ఆకర్షణకు చిహ్నంగా చెప్పుకుంటారు.
35
ఈ అమ్మాయిలు లక్కీ
ఇలా ఆరు మూల సంఖ్యగా ఉన్న అమ్మాయిలు వారి భర్తలకు అదృష్టాన్ని తెచ్చి పెడతారు. వారి వల్ల వారి భర్తలకు అంత శుభమే జరుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిలను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారికి సపోర్టుగా నిలుస్తారు. భర్త అవసరాలను, భావాలను అర్థం చేసుకుంటారు. భర్తల విషయంలో సున్నితంగా ఉంటారు.
సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం భర్తకు ఏ పనిలోనైనా సహకరించే స్వభావం ఈ అమ్మాయిలకి ఉంటుంది. దీనివల్ల పనిలో విజయం కూడా దక్కుతుంది. అలాగే భర్తకు ఉన్నత స్థాయి దక్కుతుంది. అందుకే భర్త జీవితంలో రాజయోగం కావాలంటే మూల సంఖ్య ఆరుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం మంచిది.
55
అందంగా ఉంటారు
అంతేకాదు ఆరు మూల సంఖ్య గల అమ్మాయిలు అందంగా ఉంటారు. అలాగే అందరితో ఇట్టే కలిసిపోతారు. వారు కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. వీరిని అద్భుతమైన గృహణిలుగా చెప్పుకోవచ్చు. కుటుంబానికి అదృష్టం తెచ్చే వారిగా వీరిని ప్రశంసించవచ్చు.