Dussehra 2025: దీపావళికి ముందే దసరా పండుగ వచ్చేస్తుంది. ఆ రోజే శ్రీరాముడు రావణుడిని సంహరించాడని చెప్పుకుంటారు. అయితే ఈ ఏడాది దసరా ఎప్పుడు వచ్చిందో. పూజా సమయం ఏమిటో తెలుసుకోండి.
విజయదశమిని దసరా అని పిలుచుకుంటారు. ప్రతి ఏడాది అశ్విని మాసంలోని శుక్లపక్ష దశమి రోజున ఈ పండుగను నిర్వహించుకుంటారు. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా ఈ పండుగను చేసుకుంటాం. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి చిహ్నమైన దసరా పండుగ హిందువులకు అతి ముఖ్యమైన పండుగ.
24
రావణుడిని సంహరించిన రాముడు
శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణుడిని యుద్ధంలో ఓడించి సంహరించిన రోజుగా విజయదశమిని చెప్పుకుంటారు. అందుకే దసరా రోజు రాత్రి రావణుడితో పాటు అతడి సోదరుడైన కుంభకర్ణుడు, కొడుకు మేఘనాథుల దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తారు. దసరా పండుగ కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
34
దసరా ఎప్పుడు?
పంచాంగం ప్రకారం దసరా తేదీ తిధి ప్రకారం నిర్ణయిస్తారు. అశ్విని మాసంలో శుక్లపక్ష దశమి తిధి ఎప్పుడు వస్తుందో అప్పుడు దసరా చేసుకుంటారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 1న సాయంత్రం 7:01 నిమిషానికి దశమి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 2న సాయంత్రం 07:10 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఉదయం పూట సూర్యోదయం సమయానికి ఈ తిధి ఉంటుందో అప్పుడే పండగ చేసుకుంటారు. కాబట్టి దసరా పండుగను అక్టోబర్ 2నే నిర్వహించుకోవాలి.
దసరా రోజు ఆయుధాలను పూజించే సాంప్రదాయం ఉంటుంది. ప్రజలు తమ వాహనాలను కూడా పూజిస్తారు. దసరా రోజు పూజకు పవిత్రమైన సమయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అక్టోబర్ రెండున మధ్యాహ్నం 02: 09 నిమిషాల నుండి 02:56 వరకు ముహూర్తం ఉంది. ఆ సమయంలో ఆయుధ పూజ, వాహనాల పూజ చేస్తే మంచిది. ఇక ఇంట్లో చేసుకునే పూజకు అక్టోబర్ 2 ఉదయం 9:13 నిమిషాల నుండి మంచి ముహూర్తం మొదలవుతుంది. ఎందుకంటే ఆ సమయానికి శ్రావణ నక్షత్రం ఉంటుంది. అలాగే ఆ రోజున రవి యోగం, ధృతి యోగం, సుకర్మ యోగం వంటివి కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ ఉపయోగాలు ఉన్నప్పుడు దసరా పూజ చేసుకుంటే ఇంట్లో ఎన్నో పుణ్యఫలితాలు వస్తాయి