Birth Date: నెంబర్ 3 కి చెందిన వారిని బృహస్పతి గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారికి క్రియేటివిటీ చాలా ఎక్కువ. సహజంగా వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. మరి, వీరికి ఏ తేదీల్లో పుట్టిన వారు మంచి భాగస్వామి అవుతారో తెలుసా?
మన జీవితాలను న్యూమరాలజీ చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం, భవిష్యత్తు, కెరీర్ గురించి తెలుసుకోవచ్చు. ఏ నెలలో అయినా 3, 12, 21 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. మరి.. ఈ నెంబర్ 3 కి చెందిన వ్యక్తులు.. పెళ్లి తర్వాత మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలి అంటే... ఏ తేదీల్లో జన్మించిన వారికి పెళ్లి చేసుకోవాలి? ఎవరితో వీరి కంపాటబులిటీ బాగుంటుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
25
Number 3
నెంబర్ 3 కి చెందిన వారిని బృహస్పతి గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారికి క్రియేటివిటీ చాలా ఎక్కువ. సహజంగా వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారందరినీ వీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరు చాలా తెలివిగా ఉంటారు. తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. మంచి జీవిత భాగస్వామి తమ జీవితంలోకి రావాలి అని కోరుకుంటారు. తమను ఎప్పుడూ సంతోషంగా ఉంచుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
35
ఎలాంటి వారిని ఎంచుకోవాలి?
నెంబర్ 3 కి చెందిన వ్యక్తులు.. తమలాగే టాలెంట్ ఎక్కువగా ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. తెలివైన, మేధోపరంగా తమను సవాలు చేసే భాగస్వాముల పట్ల వీరు చాలా ఎక్కువగా ఆకర్షితులౌతారు. ఎల్లప్పుడూ జీవితం పట్ల సానుకూలంగా, ఆశావాదంగా ఉన్న వ్యక్తులను వివాహం చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వ్యక్తులను పెళ్లాడితే.. వీరి జీవితం ఆనందంగా ఉంటుంది.
నెంబర్ 3 లో పుట్టిన వారికి నెంబర్ 1 కి చెందిన వారు కరెక్ట్ గా సూట్ అవుతారు. అంటే ఏ నెలలో అయినా 1, 19, 28 తేదీల్లో పుట్టిన వారు వీరికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు. వీరూ ఒకరికి మరొకరు లైఫ్ లో ఎదగడానికి సపోర్ట్ చేస్తారు. వీరు ఒకరితో మరొకరు పోటీ పడరు. పోటీ పడకుండా.. సపోర్ట్ చేసుకుంటే.. వీరికన్నా బెస్ట్ కపుల్ మరొకరు ఉండరు.
55
నెంబర్ 2 లో పుట్టిన వారు...
నెంబర్ 2 లో పుట్టిన వారు అంటే 2, 11, 20 తేదీల్లో జన్మించిన వారు కూడా నెంబర్ 3 కి మంచి మ్యాచ్ అవుతారు. వారిద్దరూ ఒకరి పట్ల ఒకరు చాలా శ్రద్ధగా , దయగా ఉంటారు. ఇద్దరూ కలిసి సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈ ఇద్దరూ వివాహానికి అనుకూలమైన జంట అవుతారు. వివాహం తర్వాత వారి సంబంధం చాలా కాలం పాటు బలంగా మారుతుంది.
నెంబర్ 4...
నెంబర్ 3 కి చెందిన వారికి.. నెంబర్ 4 చెందిన వారు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. వీరి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఒకరి ఆలోచనలు మరొకరికి అస్సలు సెట్ అవ్వవు. వ్యక్తిత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. పెళ్లి చేసుకుంటే.. సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
నెంబర్ 5...
నెంబర్ 3 లో పుట్టిన వారికి.. నెంబర్ 5 వ తేదీలో జన్మించిన వారు కూడా మంచి జోడి అవ్వగలరు. వీరి జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈ రెండు తేదీల్లో జన్మించిన వారు వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే.. వారు ఎక్కువగా కలిసి సమయం గడపడం ఆనందిస్తారు. వారి స్వభావం కారణంగా, వారు మంచి జీవిత భాగస్వాములను చేస్తారు.