న్యూమరాలజీ ప్రకారం, ప్రతి నెంబర్ కీ సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన అమ్మాయిలు చాలా కష్టపడి పని చేస్తారు. వారి కృషి ద్వారా చాలా డబ్బు, సంపద సంపాదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
25
డబ్బు సంపాదించడంలో నైపుణ్యం...
న్యూమరాలజీ ప్రకారం, 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ నెంబర్ 5వ తేదీలో జన్మించిన అమ్మాయిలకు బుధ గ్రహంతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కాబట్టి.. ఈ తేదీల్లో జన్మించిన వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ విషయం అయినా చాలా తొందరగా ఆలోచించగలరు. డబ్బు ఎలా సంపాదించాలో వీరికి బాగా తెలుసు. ఈ అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వీరు ఏ పని మొదలుపెట్టినా... పూర్తి చేయగలరు. విజయం కూడా సాధించగలరు.
ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు మానసికంగా చాలా బలంగా ఉంటారు. వారు ఏ పని అయినా చాలా త్వరగా నేర్చుకుంటారు. ఆ పనిలో చాలా తక్కువ సమయంలోనే ప్రావీణ్యం పొందుతారు. వీరు తమ కృషి, తెలివితేటలతో ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడం ద్వారా చాలా డబ్బు సంపాదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
35
వ్యాపారంలో మహారాణులు...
5వ సంఖ్య కింద జన్మించిన అమ్మాయిలు డబ్బు సంపాదించడంలో చాలా తెలివైనవారు.వీరు ఉద్యోగంలో మాత్రమే కాకుండా వ్యాపారంలో కూడా అద్భుతమైన ఖ్యాతిని సాధించే శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి, ఈ సంఖ్య కింద జన్మించిన అమ్మాయిలు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, వారు ఖచ్చితంగా పరిపూర్ణ వ్యాపార మహిళలు అవుతారు.
ధైర్యంతో సవాళ్లను ఎదుర్కొంటారు.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సహజంగానే సాహసోపేతంగా , ధైర్యంగా ఉంటారు. ఈ స్వభావం కారణంగా, వారు తమ జీవితంలో విజయం సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ సంఖ్యపై జన్మించిన అమ్మాయిలు తమ జీవితంలో వచ్చే ప్రతి సమస్యను లేదా సవాలును గొప్ప ధైర్యంతో ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.వీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనూ తమ ధైర్యాన్ని కోల్పోరు. ధైర్యంగా , కష్టపడి పనిచేస్తారు. ఎలాంటి సవాలు ఎదురైనా ధైర్యంగా స్వీకరిస్తారు. వెనకడుగు వేయరు.
న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎలాంటి సాహసోపేతమైన బాధ్యతలను స్వీకరించడానికి ఎప్పుడూ భయపడరు. ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు ధైర్యవంతులు, ఏ పరిస్థితిలోనైనా బాధ్యత తీసుకుంటారు. అందుకే ఈ సంఖ్య కింద జన్మించిన మహిళలను పరిపూర్ణ వ్యాపార మహిళలు అంటారు. సమస్యలను అధిగమించడం వారికి సులభమైన పని. పని విషయానికి వస్తే వారు ఎలాంటి బాధ్యతను స్వీకరించడానికి అయినా సిద్ధంగా ఉంటారు. సవాళ్లు మనల్ని ప్రతి పరిస్థితికి తగినట్లుగా చేస్తాయని వారు నమ్ముతారు. వారి బలమైన వ్యక్తిత్వం కారణంగా ఇతరులను తమ వైపుకు ఆకర్షించే సామర్థ్యం వారికి ఉంటుంది.
55
కుటుంబం విషయంలో మాత్రం...
వీరికి డబ్బు ఎలా సంపాదించాలి..? ఎలా ఖర్చు చేయాలి..? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయాలు వీరికి బాగా తెలుసు. కానీ.. కుటుంబ సంబంధాలను కాపాడుకోవడంలో మాత్రం వీరు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. వీరు డబ్బు సంపాదించాలని.. దిశగా పరుగులు తీస్తూ ఉంటారు. ఫలితంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కుటుంబం, కెరీర్ రెండింటినీ సరిగా బ్యాలెన్స్ చేయలేరు.అక్కడ మాత్రం వీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు.