Chandra Grahan 2025: చంద్ర గ్రహణం తర్వాత ఈ రాశులకు కష్టాలు తప్పవు..!

Published : Sep 04, 2025, 05:05 PM IST

గ్రహణ ప్రభావం.. అన్ని రాశుల వారికి అంత మంచి ఫలితాలను ఏమీ ఇవ్వదు. ముఖ్యంగా కొన్ని రాశులకు అనుకోని కష్టాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

PREV
16
చంద్ర గ్రహణం 2025

ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన సంభవించనున్న సంగతి తెలిసిందే. ఈ గ్రహణం కుంభ రాశి.. శతబిష నక్షత్రంలో ఏర్పడనుంది. అయితే.. గ్రహణ ప్రభావం.. అన్ని రాశుల వారికి అంత మంచి ఫలితాలను ఏమీ ఇవ్వదు. ముఖ్యంగా కొన్ని రాశులకు అనుకోని కష్టాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి.. ఏ రాశుల వారు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది..? జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం...

26
1.కర్కాటక రాశి...

వ్యక్తిగత కారణాల వల్ల కర్కాటక రాశివారు గణనీయమైన భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కుంటారు. చంద్ర గ్రహణ సమయంలో వారు చాలా సున్నితంగా ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు.. మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి ఎమోషన్స్ విషయంలో కంట్రోల్ గా ఉండాలి. ముఖ్యంగా తమను తాము అన్ని విషయాల్లో కాపాడుకుంటూ ఉండాలి. ఇతరులు దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

36
2.కన్య రాశి...

కన్య రాశివారు తమ జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఏ విషయంలోనూ నిరాశకు గురవ్వకూడదు. ఆధ్యాత్మిక, వ్యక్తిగత అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడవచ్చు. వారు ఖచ్చితంగా నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. గ్రహణం తర్వాత చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ కెరీర్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి.

46
తుల రాశి..

ఈ చంద్ర గ్రహణం తులారాశి వారిని బాగా ప్రభావితం చేస్తుంది. వారి వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితంలో పరిస్థితి వారికి అనుకూలంగా ఉండదు కాబట్టి వారు ఒత్తిడికి గురవుతారు. ప్రియమైన వారితో ఎంత ప్రయత్నించినా.. గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలు కూడా తారస్థాయికి చేరుకుంటాయి. అందుకే, ఈ సమయంలో వీలైనంత వరకు ఓపికగా ఉండాలి. ఎవరితోనూ ఎలాంటి సంభాషణలు చేయకుండా ఉండటమే మంచిది.

56
కుంభ రాశి

కుంభ రాశివారు ఈ చంద్ర గ్రహణం తర్వాత తమ భాగస్వామితో విడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తమ భాగస్వామి ప్రవర్తనతో విసిగి చెంది.. వారికి దూరం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు మీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పరిమితులను నిర్ణయించుకోవాలి, ఇది ముందుకు సాగడానికి అవసరమైన దశ. మీరు ప్రశాంతంగా ఉండటానికి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనాలి.

66
మీన రాశి...

మీనరాశి వ్యక్తులు ఈ చంద్రగ్రహణం ఫలితంగా భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.మీ ఆందోళన పెరుగుతుంది. అనుకోని సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలతో మీరు జీవితంలో ముందుకు సాగలేరు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మీరు మీ ప్రియమైన వారి సలహా తీసుకోవాలి. లేదంటే... నిపుణుల సలహా తీసుకోవడ మంచిది. వీలైనంత వరకు ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. అక్కడే ఆగిపోకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories