Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానం, భర్తకు అదృష్టాన్ని తెచ్చిపెడతారు

Published : Nov 05, 2025, 11:43 AM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానం. వారిని పెళ్లి చేసుకున్న భర్తలకు సంపదను తెచ్చిపెడతారు. వీరివల్ల భర్తకు అదృష్టాన్ని తెస్తారు. ఈ అమ్మాయిలు అత్తవారింట్లో అడుగుపెడితే ఆ ఇళ్లు ఆనందంతో నిండిపోతుంది. 

PREV
14
ఈ అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానం

న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన వారు ఎంతో అదృష్టవంతులు. పుట్టిన తేదీని బట్టి మూల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఆ సంఖ్యను బట్టి ఒక వ్యక్తి ప్రవర్తన, స్వభావం, వారి జీవితం ఆధారపడి ఉంటుంది. కొన్ని మూల సంఖ్యలలో పుట్టిన అమ్మాయిలను లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయిలకు విపరీతంగా డబ్బు కలిసివస్తుంది. ఆ మూల సంఖ్య లేదా ఆ తేదీలు ఏవో తెలుసుకోండి.

24
ఈ తేదీలలో పుట్టిన వారు

ఏ నెలలోనైనా 6, 15, 25 తేదీలలో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానం. వీరు ఏ ఇంట్లో కోడిలిగా అడుగుపెడతారో ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. వారి జీవితంలో సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఈ అమ్మాయిలపై శుక్ర గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంి.

34
మూల సంఖ్య

ఈ అమ్మాయిల మూల సంఖ్య లేదా రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది.  ఈ మూల సంఖ్య కలిగిన అమ్మాయిలు దయ, కష్టపడి పనిచేసేవాళ్లుగా ఉంటారు. వీరు తమ చుట్టూ ఉన్నవారందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు. పెళ్లి తర్వాత అత్తవారింట్లో అడుగుపెడితే ఆ ఇంట్లో సిరి సంపదలు, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. కుటుంబంలో ఐక్యత, ప్రేమను వీరు పెంచగలుగుతారు.

44
వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

6 నెంబర్ మూల సంఖ్యగా  ఉన్న అమ్మాయిల వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వీరు భర్తతో రొమాంటిక్‌గా ఉంటారు. ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిల జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories