కర్కాటక రాశి...
కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తూ ఉంటాడు. దీని కారణంగా, కర్కాటక రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. ఎవరినైనా తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. వీరిలో తల్లి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి బిడ్డలపై ఎలాంటి ప్రేమ చూపిస్తుందో.. ఈ రాశి అమ్మాయిలు కూడా అందరిపై అంతే ప్రేమ చూపిస్తారు. అందరితోనూ ప్రేమగా, కరుణతో ఉంటారు. తమ అనుకున్న వారి కోసం ఏం చేయడానికైనా వెనకాడరు.
ఇతరుల బాధను కూడా తమ బాధలా భావిస్తారు. ఎవరు ఏడ్చినా తట్టుకోలేరు. ఇతరుల సమస్యలను కూడా తమ సమస్యలా భావించి.. పరిష్కరించడానికి ముందుకు వెళతారు. వీరి ప్రవర్తన అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇలాంటి భార్యగా వస్తే... ఆ వ్యక్తి జీవితం ఆనందంగా మారుతుంది. ఆ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే, ఇలాంటి అమ్మాయిలు జీవితంలోకి రావాలంటే..అదృష్టం ఉండాలి.