Zodiac signs: నవంబర్ 7 నుండి ఈ మూడు రాశుల వారికి విలాసవంతమైన జీవితాన్నిచ్చే శుక్రుడు

Published : Nov 05, 2025, 10:35 AM IST

Zodiac signs: నవంబర్ 7 నుండి మూడు రాశుల వారికి విలాసవంతమైన జీవితం దక్కుతుంది. శుక్రుడి అనుగ్రహం వీరిపై ఉంటుంది. రాహువు నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. 

PREV
15
శుక్రుడి ప్రభావం

శుక్రుడు ఒకరి జాతకంలో మంచి స్థితిలో ఉంటే వారికి విలాసవంతమైన జీవితం, ప్రేమ, ఆనందం వంటివి దక్కుతాయి. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడంటే అతనికి శుక్రుడి అనుగ్రహం ఉందని అర్థం. శుక్రుడు సంవత్సరంలో ఎన్నో నక్షత్రాల గుండా ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం శుక్రుడు సొంత రాశి అయినా తులా రాశిలో ఉన్నాడు. అక్కడ చిత్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 7న శుక్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. స్వాతి నక్షత్రం రాహువుకు చెందిన నక్షత్రం కాబట్టి కొన్ని రోజులు వారికి బీభత్సంగా అదృష్టాన్ని అందిస్తుంది.

25
నవంబర్ 7 నుంచి మంచి రోజులు

నవంబర్ 7 నుండి శుక్రుడు రాహువు నక్షత్రంలో సంచరించబోతున్నాడు. కాబట్టి మేష, మిథున, సింహ రాశి వారికి ఆర్థిక లాభాలు అదృష్టం కలుగుతుంది. వారికి విలాసవంతమైన జీవితం దక్కుతుంది. వీరికి ఏఏ అంశాలలో బాగా కలిసివస్తుందో తెలుసుకోండి.

35
మేష రాశి

రాహువు నక్షత్రమైన స్వాతిలో శుక్రుడు అడుగుపెట్టడం వల్ల మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరి జీవితంలో సానుకూలత అధికంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవాలి. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక మేషరాశికి చెందిన విద్యార్థులు శుభవార్తలు వింటారు.

45
మిధున రాశి

రాహువు నక్షత్రమైన స్వాతిలో శుక్రుడు ఉండడం మిథున రాశి వారికి ఎంతో ప్రయోజనకరం. వీరికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అదృష్టమనే చెప్పాలి. అలాగే ప్రేమ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఉంటాయి. వచ్చిన ఇబ్బందులను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇక కెరీర్లో ఎదగడానికి సహాయపడే అనేక అవకాశాలు మీకు దక్కే అవకాశం ఉంది.

55
సింహ రాశి

సింహ రాశి వారికి రాహువు నక్షత్రమైన స్వాతిలో శుక్రుడు ఉండడం బాగా కలిసొచ్చే అంశం. వీరికి కెరీర్లో మంచి అవకాశాలు దొరుకుతాయి. కొత్త ఉద్యోగాలను ప్రారంభించవచ్చు. అలాగే ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే శ్రద్దగా పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఇంట్లో సరదా వాతావరణం ఏర్పడుతుంది. అయితే జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఓపికగా ఉండి వాటిని పరిష్కరించుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories