Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రికి అదృష్టాన్ని తీసుకొస్తారు

Published : Dec 21, 2025, 06:28 PM IST

Birth Date: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వాళ్ళ నాన్న జీవితాన్నే మార్చేస్తారు. అతని జీవితంలో అద్భుతమైన మార్పులు తెస్తారు. ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తమ తండ్రిల పాలిట లక్ష్మీదేవి అవుతారో తెలుసుకోండి. 

PREV
14
ఈ తేదీలలో పుట్టిన వారు

మూల సంఖ్య 3పై బృహస్పతి గ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిల మూల సంఖ్య  3 అవుతుంది. దీనికి అధిపతి గురుడు గ్రహం. గురు గ్రహం జ్ఞానానికి, గౌరవానికి ప్రతీక. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల తండ్రులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అతను చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. వీరి తండ్రి విజయపథంలో నడుస్తారు. వీరి వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.

24
మూల సంఖ్య ఆరు ఉన్న అమ్మాయిలు

మూల సంఖ్య 6 ఉన్న అమ్మాయిలపై శుక్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఒక నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టిన అమ్మాయిల మూల సంఖ్య 6 అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపదకు, సంతోషానికి కారకుడుగా ఉంటాడు. అందుకే ఈ మూల సంఖ్య ఉన్న అమ్మాయిలు పుట్టిన తర్వాత తండ్రికి విపరీతంగా కలిసివస్తుంది. వారి జీవితంలో సంతోషం కలుగుతాయి. ఇంట్లో విలాసవంతమైన వస్తువులు కొనగలుగుతారు. అలాగే ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వీళ్ళు తమ తండ్రికి అదృష్ట దేవతల లాంటి వాళ్ళు.

34
మూల సంఖ్య 5 అయితే..

మూల సంఖ్య 5 ఉన్న అమ్మాయిలపై బుధుడి ప్రభావం అధికంగా ఉంటుంది.  అంటే ఒక నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టిన అమ్మాయిల మూల సంఖ్య  5 అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడు. మూల సంఖ్య 5 కలిగిన అమ్మాయిలు వాళ్ళ నాన్న వ్యాపారానికి లక్ష్మి దేవిలా మారతారు. తండ్రికి కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. వీరి తెలివితేటలు పరోక్షంగా తండ్రి కెరీర్ ఎదుగుదలకు సహాయపడతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

44
మూల సంఖ్య 1

మూల సంఖ్య 1 కలిగిన అమ్మాయిలపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఒక నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన అమ్మాయిల మూలా సంఖ్య 1. వీరిని పాలించేది సూర్యుడు.  సూర్యుడు నాయకత్వానికి, తండ్రికి కారకుడు. ఈ మూలాంకం ఉన్న అమ్మాయిలు చాలా శక్తివంతులు. వీరు పుట్టిన తర్వాత, వాళ్ళ నాన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. వీరికి అదృష్టపు తలుపులు తెరుచుకుంటాయి. వీళ్ళు తమ సొంత కష్టంతో, తెలివితో మంచి స్థాయికి చేరుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories