Surya Varuna Yogam: అరుదైన సూర్యవరుణ యోగంతో ఈ 3 రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి

Published : Dec 21, 2025, 10:28 AM IST

Surya Varuna Yogam: నేడు.. అంటే డిసెంబర్ 21, 2025న సూర్య వరుణ గ్రహాల కలయిక జరిగింది.  దీని వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలను తొలగించి, గౌరవం, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అప్పులు తీరి ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. 

PREV
14
సూర్య వరుణ యోగం

సూర్య వరుణ యోగం అరుదుగా ఏర్పడుతుంది. ఈ యోగంలో సూర్యుడు, వరుణుడి ఒకే రాశిలో లేదా ఒకే నక్షత్రంలో కలుస్తారు. ఇది ఎంతో శుభప్రదమైన యోగం. ఈ సంయోగం అనేది ఎన్నో సమస్యలను తగ్గించి, సానుకూల శక్తి, గౌరవం, ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది. ఇప్పుడు ఏర్పడే యోగం వల్ల మూడు రాశలు వారికి అప్పులు తీరిపోయి… ఆర్ధికంగా మంచి స్థితికి చేరుకుంటారు.  డిసెంబర్ 21, 2025న ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల కోణంలో కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తారు.

24
మిథున రాశి

సూర్య వరుణ యోగం వల్ల మిథున రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాలం వీరికి చాలా శుభప్రదమని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. సూర్య, వరుణ గ్రహాల కలయిక వల్ల ఇంట్లోను,  కార్యాలయంలో సానుకూల శక్తి పెరుగుతుంది. దీని వల్ల పాత గొడవలన్నీ పరిష్కారం అవుతాయి.  ఆకస్మికంగా డబ్బు చేతికంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

34
కర్కాటక రాశి

సూర్యు వరుణ యోగం వల్ల కర్కాటక రాశి వారికి ఎంతో ప్రత్యేకమైనది. యోగం వల్ల ఈ రాశి వారికి మీ గౌరవం, పేరు పెరుగుతాయి. వీరి కష్టానికి తగ్గ గుర్తింపు దక్కుతుంది. ఎప్పుడో చేయాల్సిన పనులు ఇప్పుడు మీరు చేస్తారు. డబ్బుల పరంగా కూడా వీరికి లాభాలు దక్కుతాయి.

44
కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ యోగం కాలం ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో బలాన్ని అందిస్తుంది.  సూర్య, వరుణ గ్రహాల కలయిక మీరు తీసుకునే నిర్ణయాలకు సానుకూలంగా ఉంటుంది. అలాగే వీరు చేసిన పాత అప్పులు తీరిపోతాయి.  ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ రాశి వారు బయటపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories