నేడు మిథునరాశి వారికి వీళ్లతో గొడవలు అయ్యే అవకాశం!

Published : Sep 09, 2025, 06:30 AM IST

9.09.2025 మంగళవారానికి సంబంధించిన మిథున రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
14
మిథున రాశి ఫలాలు (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

నేడు మిథున రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

24
ఆరోగ్యం

మిథున రాశివారు మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆందోళన, ఒత్తిడి, బాధలు మనసును తొలిచేలా చేస్తాయి. ముఖ్యంగా నిద్రలేమి, అలసట, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. 

ఆర్థిక పరిస్థితి

వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల పేరుతో ఎక్కువగా ఖర్చు చేస్తారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడులు, కొనుగోళ్ల విషయంలో తొందరపడటం మంచిదికాదు. 

34
ఉద్యోగం

వృత్తి, ఉద్యోగాలు కాస్త నిదానంగా సాగుతాయి. కష్టపడినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. వివాదాల వల్ల పనిలో ఆటంకాలు రావచ్చు.

44
వ్యాపారం

వ్యాపారాలలో పాత కస్టమర్లు లేదా భాగస్వాములతో చిన్న విభేదాలు తలెత్తవచ్చు. ఈ సమయంలో కాస్త శాంతంగా ఉండటం ద్వారా సంబంధాలను కాపాడుకోవచ్చు. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ పనితీరుపై మంచి ప్రభావం చూపుతుంది.

సూచనలు:

  • మానసిక ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం చేయడం మంచిది.
  • ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి.
  • పనిలో జాప్యం ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకండి.
  • కుటుంబ సమస్యల్లో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు.
Read more Photos on
click me!

Recommended Stories