Venus Transit: సెప్టెంబర్ 15 నుంచి ఈ 4 రాశుల వారికి రెండు చేతులా డబ్బే డబ్బు, అంతా శుక్రుని అనుగ్రహం

Published : Sep 12, 2025, 11:41 AM IST

శుక్రుడు (Venus) ఉత్తమ స్థానంలో ఉంటే చాలు విపరీతంగా కలిసి వస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. అలాగే డబ్బు పరంగా కూడా కలిసొస్తుంది. సెప్టెంబర్ 15 నుంచి నాలుగు రాశుల వారికి శుక్రుడు ఇవన్నీ ఇవ్వబోతున్నాడు. 

PREV
15
సెప్టెంబర్లో శుక్ర సంచారం

శుక్రుడు అతి ముఖ్యమైన గ్రహం. ఈయన విలాసానికి, సంపదకు ప్రతీక. అలాగే ప్రేమ, అందం వంటి వాటికి కూడా ఈయననే ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయితే సెప్టెంబర్లో శుక్రుడు ముఖ్యమైన సంచారం చేయబోతున్నాడు. సూర్యునికి చెందిన రాశి అయిన సింహరాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు చేసే ఈ సంచారం ఎన్నో రాశుల వారికి కలిసి వస్తుంది. సెప్టెంబర్ 15న శుక్రుడు సింహరాశిలోకి వెళ్లి అక్టోబర్ 9 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి విపరీతంగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది.

25
మేష రాశి

మేష రాశి వారు నక్కతోక తొక్కినట్టే. సెప్టెంబర్ 15న జరిగే శుక్ర సంచారం వల్ల వారికి ఎన్నో శుభ ఫలితాలు దక్కుతాయి. వారి సంపద పెరుగుతుంది. ఆర్థికంగా బలంగా మారుతారు. జీవితంలో ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయి. వారు ఆనందంగా ఉంటారు.

35
సింహ రాశి

శుక్రుడు సింహరాశిలోకే ప్రవేశించడం వల్ల ఆ సింహ రాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సింహరాశి అధిపతి సూర్యుడు అతడు సొంత రాశిలోనే ఉన్నాడు. కాబట్టి సింహరాశి లో సూర్యుడు శుక్రుడు కలుస్తారు. దీనివల్ల శుక్రాధిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు ఘననీయంగా లాభపడతాయి.

45
తులా రాశి

తులారాశి వారికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుడి దయ తులారాశి వారిపై ఎప్పుడూ ఉంటుంది. శుక్ర సంచారం వల్ల తులా రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వారు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

55
వృశ్చిక రాశి

శుక్ర సంచారం అనేది వృశ్చిక రాశి వారికి సంపదను తెచ్చిపెడుతుంది. వారి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సమాజంలో కూడా వారికి తగినంత గౌరవం లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories