1.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు సహజంగా కుటుంబం పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు. వారు తమ కుటుంబం, బంధువులు, స్నేహితుల కోసం.... ఏం చేయడానికి అయినా ముందుంటారు. ఏ విషయంలోనూ ఏ మాత్రం వెనకాడరు. వారి కోసం ఏదైనా త్యాగం చేయడంలో ముందుంటారు. ఈ రాశివారు.. డబ్బు, ఇల్లు, బంగారం, భూమి, కార్లు, ఆస్తులు ఇలాంటి వాటికి కొంచెం కూడా ఆకర్షితులు అవ్వరు. కానీ.. తాను నా అనుకున్న వాళ్లు సంతోషంగా నవ్వుతూ తన చుట్టూ ఉంటే మాత్రం చాలా అని అనుకుంటారు. అది వారికి స్వర్గం తో సమానం. కర్కాటక రాశివారు సహజంగా ఎమోషనల్ గా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమించారంటే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. వీరు చూపించిన ప్రేమ తిరిగి తమకు అందకపోతే.. లోలోపల బాధపడతారు తప్ప... బయటకు మాత్రం చూపించరు.