Money: రోడ్డు మీద దొరికిన డబ్బులు తీసుకుంటే ఏమౌతుంది?

Published : Oct 28, 2025, 06:03 PM IST

Money: రోడ్డు మీద అప్పుడప్పుడు చాలా మందికి డబ్బులు దొరుకుతూ ఉంటాయి.  అలా డబ్బు దొరకడాన్ని కొందరు అదృష్టంగా పిలిస్తే, మరి కొందరు దురుదృష్టంగా చెబుతారు.  

PREV
14
డబ్బు దొరికిందా?

రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే.. కొందరికి డబ్బు దొరుకుతూ ఉంటుంది.  ఇలా డబ్బు దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ, కొందరు మాత్రం అలా దొరికిన డబ్బు తీసుకోవడం మంచిది కాదని,  అది నెగిటివ్ ఎనర్జీని పెంచుతుందని నమ్ముతారు. అందుకే, అలా దొరికిన డబ్బు తీసుకోకూడదని అంటూ ఉంటారు.  ఇందులో నిజమెంత? జోతిష్యశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం….

24
దేవుని ఆశీర్వాదం..

కొందరు వాస్తు నిపుణులు, డబ్బు దొరకడం దేవుడి ఆశీర్వాదంగా పరిగణిస్తున్నారు. పూర్వీకుల ఆశీస్సుల వల్లే డబ్బు దొరుకుతుందని , ముఖ్యంగా నాణేలు దొరకడం అదృష్టానికి, మంచి ఆర్థిక భవిష్యత్తుకు సంకేతం అని చెబుతున్నారు.

34
దొరికిన డబ్బు ఏం చేయాలి?

దొరికిన డబ్బును వెంటనే ఖర్చు చేయకూడదు. వాటిని మీ పర్సులో లేదంటే.. దేవుడి గదిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే,  దేవుడి గుడిలో హుండీలో వేయడం మంచిది. 

44
ఎలా ఖర్చు చేయాలి?

రోడ్డుపై డబ్బు కనిపిస్తే వెంటనే తీసుకోకండి. దాని వెనుక ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోండి. దేవుడి ఆశీర్వాదంగా భావిస్తే శుభం. స్వార్థంతో వాడితే సమస్యలు రావచ్చు. కాబట్టి ఆలోచించి నడుచుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories