నవంబర్ లో చాలా గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. ఈ రాశుల మార్పు గ్రహాల సంయోగాలను ఏర్పరచనున్నాయి. ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో త్రిగ్రహి యోగం వృశ్చిక రాశిలో ఏర్పడనుంది. ఈ యోగం గ్రహాలకు అధిపతి అయిన కుజుడు, సంపదను ఇచ్చే శుక్రుడు, సూర్యుడి కలయిక ద్వారా ఏర్పడుతుంది. దీంతో.. ఇది కొన్ని రాశుల అదృష్టాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ముఖ్యంగా కెరీర్ అద్భుతంగా మారుతుంది. వ్యాపారంలోనూ లాభాలు చూస్తారు. నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. వాహన యోగం కూడా ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....