జనవరి 17న చాలా అరుదైన, శుభప్రదమైన గ్రహాల కలయిక ఏర్పడింది. బుధుడు మకర రాశిలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే సూర్యుడు, శుక్రుడు, కుజుడు ఇదే రాశిలో ఉండగా...బుధుడు కూడా వచ్చి చేరాడు. ఈ నాలుగు గ్రహాల ఏకకాల సంచారం మూడు రాజయోగాలను ఏర్పరుస్తుంది. సూర్యుడు, బుధుని కలయిక బుధాదిత్య రాయోగం, శుక్రుడు, బుధుని కలయిక లక్ష్మీ నారాయణ రాజయోగం, కుజుడు కారణంగా పంచ మహారుష రాజయోగం ఏర్పరస్తుంది.దీని కారణంగా.. మూడు రాశుల వారికి గోల్డెన్ టైమ్ మొదలైంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...