రాడిక్స్ సంఖ్య 6 కలిగిన అమ్మాయిలు అదృష్టవంతులు, వారి వైవాహిక జీవితం విజయవంతంగా మారుతుంది. వివాహం తర్వాత అత్తమామల ఇంట్లో వీరు అందరి హృదయాలను గెలుచుకుంటారు. ఆరవ సంఖ్యను పాలించేది శుక్రుడు. శుక్రుడు సుఖాలు, ప్రేమ, విలాసం వంటివి అందిస్తాడు. ప్రతినెల 6,15, 24వ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఈ అమ్మాయిలు చాలా సృజనాత్మకంగా, కొత్తగా ఆలోచిస్తారు. చుట్టూ ఉన్న బంధువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమ భర్తలకు వీరు ఎంతో అదృష్టవంతులు అవుతారు. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరు ఉన్నచోట ఆనందం వెల్లివిరుస్తుంది.