Sun transit: తన మిత్రుడి నక్షత్రంలోకే సూర్యుడు ఎంట్రీ ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్

Published : Nov 28, 2025, 02:31 PM IST

Sun transit: సూర్య భగవానుడి సంచారం ఎన్నో రాశులకు కలిసొస్తుంది. సూర్యుడు బుధుడికి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల 3 రాశుల వారికి అన్ని రకాలుగా కలిసివస్తుంది. వీరికి  అదృష్టం దక్కుతుంది.  కీర్తి, మంచి పేరు దక్కుతాయి.

PREV
15
సూర్యుడి సంచారం ఎంతో ముఖ్యం

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయన  రాశిని మార్చినా, నక్షత్ర మార్పు జరిగిన ఎన్నో రాశుల వారికి మేలు జరుగుతుంది.  సూర్యుడి స్థాన మార్పు మూడు రాశుల వారికి గౌరవం, ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. 

25
డిసంబర్ 3న సూర్య సంచారం

డిసెంబర్ 3న సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు.  జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధ, సూర్యులు దగ్గర మిత్రులే.  కాబట్టి ఈ సంచారం మూడు రాశులకు బీభత్సంగా కలిసివస్తుంది.

35
మేష రాశి

సూర్యుడి నక్షత్రం మార్పు మేషరాశి కలిసి వస్తుంది.  ఈ సూర్య సంచారం ఈ రాశి వారికి అనుకూలమైన మార్పులు వస్తాయి. ఉద్యోగంలో సక్సెస్ సాధిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కచ్చితంగా తీరుస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి అతి త్వరగా మెరుగుపడుతుంది. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.

45
కన్యా రాశి

సూర్య సంచారం కన్యా రాశి వారికి అనుకూలమైన సమయం. వీరికి మంచి వ్యాపార ఒప్పందాలు లభిస్తాయి.  వీరు ఏ పని ప్రారంభించినా విజయం దక్కుతుంది.  మీకు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. వీరి ఆదాయం కూడా పెరుగుతుంది.

55
మీన రాశి

మీన రాశి వారికి మంచి రోజులు మొదలవ్వబోతున్నాయి. సూర్యుడి వల్ల ఉద్యోగంలో ప్రమోషన్, జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. వీరికి వ్యాపారాలు విస్తరించేందుకు ఇదే మంచి అవకాశం. వీరిలో ఏ పనిచేగలమన్నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎక్కడికి వెళ్లినా ఈ రాశి వారికి మంచి గుర్తింపు, మద్ధతు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories