Ketu Gochar: కేతు నక్షత్ర మార్పు... ఈ నాలుగు రాశులకు భారీ నష్టాలు తప్పవు..!

Published : Nov 28, 2025, 10:26 AM IST

Ketu Gochar: క్రూరమైన గ్రహం కేతువు తన నక్షత్రాన్ని మార్చుకోవడం ద్వారా నాలుగు రాశులకు చెందిన వ్యక్తులకు మరిన్ని ఇబ్బందులు రానున్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. 

PREV
15
Zodiac signs

జోతిష్యశాస్త్రంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి. వాటిలో రెండు నీడ గ్రహాలు. అవే రాహు, కేతువులు. ఈ రెండు గ్రహాలను క్రూరగ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల ప్రత్యేకత ఏమిటంటే... ఈ రెండూ ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలోనే కదులుతూనే ఉంటాయి. తాజాగా ఈ రెండు గ్రహాలు నక్షత్రాలను మార్చుకున్నాయి. ఈ సమయంలో కేతువు సింహ రాశిలో సంచరిస్తూ.. పూర్వ పాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ కేతువు నక్షత్ర మార్పు కారణంగా, నాలుగు రాశులకు చెందినవారు అనేక సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....

25
మేష రాశి....

మేష రాశిలో కేతువు మార్పు కారణంగా ఈ రాశివారు ఈ సమయంలో భారీ నష్టాలు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా వ్యాపారాల్లో, స్టాక్ మార్కెట్లలో ఈ నష్టాలు రావచ్చు. ఈ కాలంలో మేష రాశి కి చెందిన వ్యక్తుల ఇంట్లో వాదనలు, గొడవలు, తగాదాలు జరిగే అవకాశం ఉంది. మీకు నచ్చకపోయినా ఎవరికో ఒకరికి డబ్బు అప్పుగా ఇవ్వవలసిన రావచ్చు. అదేవిధంగా ఈ రాశివారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

35
2.సింహ రాశి...

కేతువు నక్షత్ర మార్పు సింహ రాశి వారిని చాలా రకాల ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది. ఊహించని వైపు నుంచి సమస్యలు ఎదురౌతాయి. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. వీరి కారణంగా, కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. చికిత్స కోసమే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావచ్చు.

45
3.తుల రాశి...

తుల రాశిలో జన్మించిన వ్యక్తులు కేతు నక్షత్ర మార్పు కారణంగా ఈ కాలంలో తమ డబ్బును ఎక్కడా పెట్టుబడి పెట్టకూడదు. లేకపోతే, ఎక్కువ నష్టాలు ఎదుర్కునే అవకాశం ఉంది. ఈ కాలంలో, తుల రాశిలో జన్మించిన వ్యక్తుల ప్రేమ సంబంధాన్ని అందరూ వ్యతిరేకించవచ్చు. అనుకోని కోర్టు సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతరులు చేసే కుట్రల్లో వీరు చిక్కుకునే ప్రమాద కూడా ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

55
4.కుంభ రాశి...

కేతువు నక్షత్ర మార్పు కుంభ రాశివారికి కూడా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఊహించని చెడు వార్తలు వినాల్సి రావచ్చు. ఈ సమయంలో కుంభ రాశివారు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకపోవడమే మంచిది. ఇస్తే.. ఆ డబ్బు మళ్లీ మీకు తిరిగి రాకపోవచ్చు. మీరు డబ్బులు పోగొట్టుకొని... ఇతరుల నుంచి మళ్లీ డబ్బు అప్పుగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి.. ఈ విషయంలో ఆచి తూచి అడుగు వేయాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories