Vastu tips: ఇంట్లో ఈ వస్తువులకు కొరత రానివ్వకండి, ధన దేవతలకు కోపం వచ్చేస్తుంది

Published : Jan 15, 2026, 06:25 AM IST

Vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచకూడదు. అవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. వాస్తు దోషాలను సృష్టిస్తాయి. దీనివల్ల నష్టాలు, కష్టాలు వస్తాయి. 

PREV
15
ఇంటికి వాస్తు చిట్కాలు

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లో పాజిటివ్ శక్తి పెరగాలంటే కొన్ని పనులు చేయాలి. ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా ఉండడం లేదా కొరత రావడం వల్ల ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, అనుబంధాలలో గొడవలు వస్తాయి. అలాగైతే జీవితంలో పురోగతి కూడా ఉండదు. కొన్ని వస్తువులను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి, కుబేరుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవిని, కుబేరుడిని సంతోషంగా ఉంచితే మీరు ఆర్థికంగా ఎదుగుతారు. ఏ వస్తువులు ఖాళీగా ఉంచకూడదో తెలుసుకోండి.

25
పర్సు

మీ ఇంట్లోని పర్సు లేదా డబ్బులు పెట్టే సేఫ్ వంటివి ఖాళీగా ఉంచడం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. ఇది డబ్బు ప్రవాహాన్ని నిరోధించడానికి ప్రధాన కారణంగా కూడా మారుతుంది. కాబట్టి మీ పర్సును ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకండి. కనీసం ఒక నోటు లేదా నాణెం ఉంచండి. ఇక బీరువాలో ఉండే సేఫ్ లో కొంత డబ్బు ఉంచండి. ఇది స్థిరంగా డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది. ఇంట్లో ఆర్థిక సంక్షోభం రాకుండా అడ్డుకుంటుంది.

35
కలశం

ఇక మీ పూజ గదిలో కచ్చితంగా నీటితో నిండిన కలశాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి. ఖాళీ కలశం ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుంది. మంచినీరు, పువ్వులు, మామిడి ఆకును దానిలో ఎప్పుడూ ఉంచండి. ఇది ఇంట్లో శాంతిని, సానుకూల శక్తిని అందిస్తుంది. దేవతల ఆశీర్వాదాలు మీ మీద ఉండేలా చేస్తుంది. అదే ఖాళీ నీటి కలశం పూజా ప్రయోజనాలను తగ్గిస్తుంది.

45
బకెట్

ఇక బాత్రూంలో కూడా బకెట్ ను చాలా మంది ఖాళీగా ఉంచుతారు. ఇది ఇంట్లోనే నీటి సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, డబ్బు ప్రవాహం ఆగిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి బకెట్ నిండా నీరు నింపి ఉంచండి. నీటిని మార్చేటప్పుడు ఓం నమశ్శివాయ అని జపించడి. ఇది చాలా సులభమైన వాస్తు పరిహారంగా చెప్పుకోవచ్చు.

55
బియ్యం

ఇక బియ్యం ఉండే కంటైనర్ ను కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇది అన్నపూర్ణ దేవికి కోపం తెప్పిస్తుంది. దీనివల్ల ఇంట్లో ఆహార కొరత, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. బియ్యం పాత్ర ఎప్పుడూ నిండుగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో స్థిరంగా ఆహార సరఫరా జరుగుతూనే ఉంటుంది. కుటుంబాపిరి ఎప్పుడూ ఆకలి కలుగదు. ఆకలితో అలమటించాల్సిన అవసరం రాదు.

ఇప్పుడు వాస్తు చెబుతున్న ప్రకారం ఖాళీ స్థలము లేదా ఖాళీగా ఉన్నా వస్తువు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది ఎందుకంటే కాళీ ప్రదేశంలో శక్తి శూన్యంగా ఉంటుంది దీని వల్ల ఇంట్లో అడ్డంకులు ఏర్పడతాయి నిండుగా ఉండడం వల్ల స్థిరత్వం కలుగుతాయి పైన చెప్పిన విధంగా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి కుబేరుడు అన్నపూర్ణాదేవి కోపానికి గురికాకుండా ఉంటారు దీనివల్ల ఇంట్లో శాంతి సౌభాగ్యం పెళ్లి విరుస్తాయి

Read more Photos on
click me!

Recommended Stories