దీపావళి రోజు ఏ రాశివారు ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చో తెలుసా?

Published : Oct 18, 2025, 05:11 PM IST

దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైనది. ఆ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే చిన్న చిన్న పరిహారాలు చేయాల్సి ఉంటుంది. మరి పండుగ నాడు ఏ రాశివారు ఏం చేయాలి? ఎలాంటి దీపాలు వెలిగించాలి? ఏ రంగు దుస్తులు ధరించాలి? వంటి విషయాలు ఇక్కడ చూద్దాం. 

PREV
113
దీపావళి-2025

ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20న వస్తోంది. ఈ వెలుగుల పండుగ నాడు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రాశి, ఒక్కో గ్రహస్థితి ఉంటుంది కాబట్టి.. ప్రతి రాశి వారికి అనుసరించాల్సిన పూజా విధానాలు, పరిహారాలు వేరుగా ఉంటాయి. రాశి ప్రకారం తగిన పద్ధతిలో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చు. మరి ఈ దీపావళి నాడు ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి

మేష రాశివారు దీపావళి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించి, గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక పురోగతి సాధించవచ్చు. పూజ సమయంలో నెయ్యిదీపం వెలిగించడం శుభప్రదం. పండుగ రోజు రాత్రి ఒక తెల్లని వస్త్రంలో కొద్దిగా చందనం, కుంకుమపువ్వు కట్టి లాకర్‌లో లేదా డబ్బు పెట్టెలో ఉంచాలి. దానివల్ల డబ్బు కొరత ఉండదు.

313
వృషభ రాశి

దీపావళి నాడు వృషభ రాశి వారు ఇంటిని శుభ్రపరిచి, వెండి నాణెం లేదా వెండి వస్తువులను పూజలో వినియోగిస్తే శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి తామర పువ్వును సమర్పించి, పాయసం నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల జీవితంలో సుఖ శాంతులు ఉంటాయి. 

413
మిథున రాశి

మిథున రాశి వారు పూజాస్థలంలో తులసి మొక్కను ఉంచి, లక్ష్మీదేవిని ఆకుపచ్చ రంగు పుష్పాలతో పూజించాలి. దానివల్ల సంపద వృద్ధి చెందుతుంది. ఇలా చేసేటప్పుడు లక్ష్మీ మంత్రాన్ని జపించాలి. 

513
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి తెలుపు రంగు వస్త్రాలు ధరించడం, బియ్యం లేదా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం శుభప్రదం. లక్ష్మీదేవి ముందు వెండి దీపం వెలిగించి పూజ చేయడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తులు వ్యాపిస్తాయి. 

613
సింహ రాశి

సింహ రాశివారు దీపావళి సాయంత్రం పసుపు రంగు దుస్తులు ధరించి.. ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యితో దీపాలు వెలిగించాలి. అందులో నల్ల నువ్వులు కూడా వేయాలి. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుంది. అదృష్టం కలిసివస్తుంది.  

713
కన్య రాశి

కన్య రాశి వారు ఇంటిని శుభ్రం చేసుకొని.. తులసితో మంగళార్చన చేయాలి. తెలుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం పెరుగుతుంది.

813
తుల రాశి

తుల రాశి వారు గులాబీ లేదా నీలం రంగు వస్త్రాలు ధరించి, లోటస్ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు, శాంతి లభిస్తాయి. అంతేకాదు ఆ రోజున రావి ఆకుపై కుంకుమపువ్వుతో 'శ్రీం శ్రియై నమః' అని రాసి, దాన్ని పర్సులో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. 

913
వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారు దీపావళి రోజున లక్ష్మీదేవికి ఎర్రని చున్రీ, గాజులు, మెట్టెలు వంటి సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులను సమర్పించాలి. తర్వాత వాటిని ఒక ముత్తైదువకు దానం చేయాలి. దీనివల్ల మీ జీవితం సంతోషంగా ఉంటుంది.

1013
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు దీపావళి నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. లక్ష్మీదేవికి పసుపు రంగులో ఉండే స్వీట్ నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల వారి కష్టాలు తీరి..  సుఖాలు పొందుతారు.

1113
మకర రాశి

మకర రాశి వారిపై శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల నీలం లేదా బూడిద రంగు వస్తువులతో పూజ చేయడం శ్రేయస్కరం. సామాజిక సేవ చేయడం ద్వారా కూడా లక్ష్మీ అనుగ్రహం పొందవచ్చు.

1213
కుంభ రాశి

కుంభ రాశి వారు దీపాలతో ఇంటిని అలంకరించి, పక్షులకు ధాన్యాన్ని వేసి పుణ్యం సంపాదించవచ్చు. వెండి పాత్రలో నీటిని పోసి పూజా స్థలంలో ఉంచడం శుభప్రదం.

1313
మీన రాశి

మీన రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించి, పసుపు కలర్ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సంపద, సంతోషం పెరుగుతాయి. ఆధ్యాత్మిక పుస్తకాలు దానం చేసినా ఈ రాశివారికి మేలు జరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories