Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఇంట్లో ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలంటే...

Published : Oct 18, 2025, 03:50 PM IST

దీపావళి రోజు (Diwali 2025) లక్ష్మీదేవిని ప్రసన్నం చేసేందుకు భక్తులు పూజ చేస్తారు. ఆమె కరుణా కటాక్షాల కోసం దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు ఇంట్లోని ఏ మూలల్లో పెట్టాలో తెలుసుకోండి. సరైన చోట దీపాలు వెలిగిస్తే జీవితంలో సిరిసంపదలు, సంతోషానికి కొరతే ఉండదు.

PREV
15
దీపావళి 2025

మనదేశంలో ఎంతో మందికి ఇష్టమైన పండుగ దీపావళి. ఈ పండుగ కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు. చీకటిపై వెలుగు సాధించిన విజయమే దీపావళి. ప్రతి ఏటా కార్తీక మాస కృష్ణపక్ష అమావాస్య రోజున ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఆరోజున లక్ష్మీదేవి, వినాయకుడి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. దీపావళి రోరజు ఇంట్లోని కొన్ని చోట్ల దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం. అక్కడ దీపాలు పెట్టడం వల్ల ఇల్లు భోగభాగ్యాలతో, ప్రశాంతతతో నిండి ఉంటుంది.

25
ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలి?

దీపావళిరోజు  ఇంటి వాకిలి దగ్గర కచ్చితంగా దీపం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆ తరువాత ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు అర్థం.  గుమ్మానికి రెండు వైపులా దీపాలు పెట్టాలి. ఇలా పెడితే అవి సంపద ద్వారాల్లా కనిపిస్తాయి. సంపదను ఇంట్లోకి ఆహ్వానిస్తాయి.

35
వంటగదిలో దీపం

దీపావళికి కచ్చితంగా వంటగదిలో దీపం వెలిగించాలి.  దీనివల్ల  అన్నపూర్ణాదేవి అనుగ్రహం  మీకు కచ్చితంగా లభిస్తుంది. వంటగదిలో దీపం పెట్టడం మీ పొలాల్లో  పంటలు బాగా పండుతాయి. ఆహారానికి ఎలాంటి కొరత ఉండదు. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం జీవితాంతం లభిస్తుంది. 

45
తులసి మొక్క దగ్గర

మీ ఇంట్లో తులసి మొక్క దగ్గర ఉంటే కచ్చితంగా దీపం వెలిగించండి. తులసి దగ్గర పెడితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీని వల్ల ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, సంతోషం పెరుగుతాయని అంటారు. 

55
దీపాలు పెట్టడం ఎంతో ముఖ్యం

దీపావళికి ఇంట్లో దీపాలు పెట్టడం చాలా ముఖ్యం.  దీపం అంటే ఒక నమ్మకం, శ్రేయస్సు, ప్రశాంతతకు చిహ్నం. ఈ దీపావళికి దీపాలు వెలిగించి, జీవితంలోకి సిరిసంపదలు, సంతోషం, శాంతిని ఆహ్వానించండి. 

Read more Photos on
click me!

Recommended Stories