వజ్రాలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వీటిని అందం, ఐశ్వర్యం, సంపదకు చిహ్నాంగా భావిస్తారు. కానీ జ్యోతిష్యం ప్రకారం వజ్రాలు ధరించడం అందరికీ మంచిదికాదట. కొన్ని రాశులవారు వజ్రాలు పెట్టుకోవడం వల్ల నష్టాలే ఎక్కువట. మరి ఆ రాశులేంటో చూద్దామా..
డైమండ్ రింగ్స్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఎంత బాగుంటాయో అందరికీ తెలుసు. డైమండ్స్ పొదిగిన ఆభరణాల ప్రత్యేకతే వేరు. ఎవరైనా సరే వీటిని పెట్టుకుంటే వారి లుక్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఇలా అందాన్ని రెట్టింపు చేసే డైమండ్స్ ని ఎవరు మాత్రం పెట్టుకోవద్దు అనుకుంటారు చెప్పండి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు వజ్రాలను అస్సలు ధరించకూడదట. మరి ఏ రాశులవారు వజ్రాల ఆభరణాలు పెట్టుకోకూడదో ఇక్కడ చూద్దాం.
26
ఈ రాశులవారికి లాభాలకంటే నష్టాలే ఎక్కువ!
సాధారణంగా వజ్రాలను అందం, ఐశ్వర్యం, సంపదకు చిహ్నాంగా భావిస్తారు. వీటిని అదృష్టానికి సంకేతంగా చెప్పుకుంటారు. కానీ వజ్రాలు అందరికీ మంచి చేయవని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన జ్యోతిష్య సలహా లేకుండా వజ్రాలు ధరించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతాయట. ఏ రాశులవారికి వజ్రాల వల్ల నష్టం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
36
శుక్రుడు బలహీనంగా ఉంటే?
వజ్రం శుక్ర గ్రహానికి సంబంధించింది. శుక్రుడు ప్రేమ, అందం, ఆనందానికి చిహ్నం. జాతకంలో శుభ శుక్రుడు ఉన్నవారు మాత్రమే వజ్రాలు ధరించాలి. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వజ్రం ధరిస్తే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, సంబంధాల్లో ఇబ్బందులు రావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మేష రాశి వారు కూడా వజ్రాలు ధరించకూడదు. ఈ రాశిలో శుక్రుడు బలహీనంగా ఉంటాడు. వజ్రాలు ధరిస్తే మానసిక ఒత్తిడి, వైవాహిక సమస్యలు, ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. కర్కాటక, సింహ, వృశ్చిక, మీన రాశుల వారికి కూడా వజ్రాలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
56
ఈ రాశుల వారు వజ్రాలు పెట్టుకుంటే?
వృషభ, తుల రాశుల వారికి శుక్రుడు అనుకూలం. కాబట్టి వీరికి వజ్రాలు ధరించడం మంచిదని అంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదట. ఈ రాశులలోని కొన్ని నక్షత్రాలు, ముఖ్యంగా కృత్తిక నక్షత్రం, వజ్రాలకు అశుభమట. కృత్తిక నక్షత్రం కలిగినవారు వజ్రాలు ధరిస్తే కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు రావచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
66
జ్యోతిష్య సలహా అవసరం!
వజ్రాలు చాలా ఖరీదైనవి. అయితే ఇవి అందరికీ అదృష్టం, సంపద తెస్తాయని చెప్పలేము. జాతకం, శుక్ర స్థితిని బట్టి వజ్రాలు ధరించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సరైన జ్యోతిష్య సలహా లేకుండా వజ్రాలు ధరిస్తే నష్టం జరగవచ్చు. వజ్రం కొనే ముందు తప్పకుండా జాతకం చూసుకోవాలని పండితులు చెబుతున్నారు.