Dhana Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో మిథున రాశిలో కొన్ని శక్తివంతమైన గ్రహాల కలయిక జరగనుంది. దానివల్ల ధన యోగం ఏర్పడనుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి అపారమైన సంపదను అందిస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవో? అందులో మీ రాశి ఉందో చూడండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు తమ స్థానాలను మార్చుకున్నప్పుడు రకరకాల యోగాలు ఏర్పడతుంటాయి. వాటిలో సంపద, అభివృద్ధి, జీవితంలో ఎదుగుదలకు సంకేతమైంది 'ధన యోగం'. మే 14న మిథున రాశిలో శుక్రుడు, బృహస్పతి, చంద్రుడు కలవడం వల్ల ఈ శక్తివంతమైన యోగం ఏర్పడనుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది ఆర్థికంగా గొప్ప పురోగతిని, జీవితంలో కొత్త అవకాశాలను అందిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..
26
మేష రాశి- కుటుంబంలో సంతోషం
మేష రాశి వారికి ఈ ధన యోగంతో అదృష్ట కాలం మొదలవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో మంచి పురోగతి ఉంటుంది. పాత అప్పులు తీర్చడానికి కుటుంబ సభ్యుల సపోర్ట్ లభిస్తుంది. కొందరికి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రావచ్చు.
36
కన్య రాశి- మంచి మార్పులు
కన్య రాశి వారికి వృత్తి, వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. డబ్బు రాక పెరిగి, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆఫీసులో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేయడానికి మంచి అవకాశం దొరుకుతుంది. పెళ్లికాని వారికి మంచి పెళ్లి సంబంధాలు కుదరవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.
సింహ రాశి వారికి ఈ ధన యోగం ఆదాయాన్ని పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలలో జీతం పెంపు లేదా ప్రమోషన్ లభించే సూచనలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
56
మకర రాశి- మంచి మార్పులు
మకర రాశి వారికి ఈ సమయం ఎన్నో మంచి మార్పులను తీసుకొస్తుంది. వృత్తి, ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు మెల్లగా తొలగిపోతాయి. చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కవచ్చు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ఇది సరైన సమయం.
66
వృశ్చిక రాశి- కొత్త అవకాశాలు
వృశ్చిక రాశి వారికి ఈ యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. పని చేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఫలితం దక్కుతుంది. ప్రయాణ అవకాశాలు పెరగవచ్చు. కుటుంబంతో సంతోషంగా గడిపే సందర్భాలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.