Mercury Transit: ఈ 4 రాశులవారి జీవితాన్ని మార్చేయబోతున్న బుధుడు, రాహు నక్షత్రంలోకి ప్రవేశం

Published : May 07, 2026, 11:31 AM IST

Mercury Transit: గ్రహాలకు రాజకుమారుడైన బుధుడు రాహు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆర్థ నక్షత్రం రాహుకు సంబంధించినది. దీనివల్ల నాలుగు రాశుల వారికి సకల శుభాలు కలుగుతాయి. జూన్ 2న ఆర్ధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు బుధుడు. 

PREV
14
మిథున రాశి

రాహువుకు సంబంధించిన ఆర్ధా నక్షత్రంలోకి బుధసంచారం వల్ల మిథున రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వం, మాటతీరు ఆకర్షణీయంగా మారుతుంది. తమపై తమకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి మేధో సంపత్తి కూడా వృద్ధి చెందుతుంది. చేయాల్సిన పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారం చేసే వారికి ఇది మంచి సమయం. ఆర్థిక ప్రయోజనాలు కూడా అమితంగా పొందుతారు.

24
సింహ రాశి

బుధుని సంచారం సింహ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. పనిలో వీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరైనా విదేశాలలో చదువుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ కోరిక కూడా నెరవేరుతుంది. సమాజంలో మంచి హోదా వస్తుంది.

34
కన్యా రాశి

ఆర్ధ నక్షత్రంలోకి బుధ సంచారం కన్యారాశి వారికి లాభ మార్గాలను తెరుస్తుంది. ఎవరైనా ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచి సమయం. పనిలో వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక వైవాహిక జీవితంలో ప్రేమ మరింతగా పెరుగుతుంది. కన్యా రాశి వారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు సమర్థంగా తీసుకోగలుగుతారు.

44
కుంభ రాశి

బుధుడి సంచారం కుంభ రాశి వారికి అంతా అనుకూలంగా మారుస్తుంది. పరిశోధనా రంగంలో పనిచేస్తున్న వారు మంచి పురోగతిని చూస్తారు. వీరికి కుటుంబంతో గడిపేందుకు మంచి సమయం దొరుకుతుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక వ్యక్తులు తమ సొంత పనులను చక్కగా నిర్వహిస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories