ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
సన్నిహితులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.
313
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
513
కర్కాటక రాశి ఫలాలు
ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
613
సింహ రాశి ఫలాలు
స్నేహితులు మీ మాటతో విభేదిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
713
కన్య రాశి ఫలాలు
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.
813
తుల రాశి ఫలాలు
ఆదాయం మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తప్పవు. కొందరి ప్రవర్తన తలనొప్పి తెప్పిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
913
వృశ్చిక రాశి ఫలాలు
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి.
1113
మకర రాశి ఫలాలు
ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి.
1213
కుంభ రాశి ఫలాలు
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన ఉద్యోగ, వివాహ యత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
1313
మీన రాశి ఫలాలు
సన్నిహితులతో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు తప్పవు.