నేడు ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం!

Published : Sep 06, 2025, 05:00 AM IST

ఈ రాశి ఫలాలు 6.09.2025 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు ఇతరులతో మాట పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

413
మిథున రాశి ఫలాలు

దూరప్రాంత బంధువులతో శుభకార్యాలకు హాజరవుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు పొందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

కీలక వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం కావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

613
సింహ రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

713
కన్య రాశి ఫలాలు

ఉద్యోగం విషయంలో అధికారుల నుంచి సానుకూలత పెరుగుతుంది. అప్పులు కొంతమేర తీర్చుతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది.

813
తుల రాశి ఫలాలు

ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉండదు. వృత్తి, ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. నిరుద్యోగుల కష్టం వృథాగా మిగులుతుంది. కొత్త అప్పులు చేయకపోవడం మంచిది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాల్లో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

1113
మకర రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలు మండకొడిగా సాగుతాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. వృథా ఖర్చులను అదుపు చేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు స్వల్ప ఇబ్బందులు తప్పవు. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారిస్తారు.

1313
మీన రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో ఏర్పడిన పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories