Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారిని మించిన తెలివితేటలు మరొకరికి ఉండవు..!

Published : Jun 05, 2025, 10:22 AM IST

బుధుడు అంటేనే తెలివితేటలు, బుద్ధి కి మారుపేరు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా ఈ రెండూ చాలా ఎక్కువగా ఉంటాయి.

PREV
15
పుట్టిన తేదీ..

న్యూమరాలజీ లోని అంకెలు మన జీవితాన్ని చాలా ఎక్కువగానే ప్రభావం చూపిస్తాయి. జోతిష్యం మాదిరిగానే న్యూమరాలజీ ప్రకారం మన జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మన ప్రవర్తన, వ్యక్తిత్వం లాంటివి కూడా తెలుసుకోవచ్చు. తెలివితేటలు అనేవి ఎవరికైనా పుట్టుకతోనే వస్తాయి. కొందరికి వయసు పెరుగుతుంటే ఆ తెలివితేటలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే.. న్యూమరాలజీ ప్రకారం మూడు తేదీల్లో పుట్టిన వారికి మాత్రం అపారమైన తెలివితేటలు ఉంటాయట.మరి, ఆ తేదీలేంటో చూద్దాం..

25
నెంబర్ 5..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. బుధుడు అంటేనే తెలివితేటలు, బుద్ధి కి మారుపేరు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా ఈ రెండూ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే, వీరి మనసు ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఒక్కదానికి అంకితమై ఉండలేరు. కొత్త విషయాలను తెలుసుకుంటూ, కొత్త వ్యక్తులను జీవితంలోకి ఆహ్వానించడంలో ముందుంటారు.

35
తెలివి తేటలకు పరాకాష్ట

నెంబర్ 5 కింద జన్మించిన వారు తెలివితేటలకు పరాకాష్టగా నిలుస్తారు. ఎంత క్లిష్టమైన సమస్య అయినా వారు చాతుర్యంతో పరిష్కరిస్తారు. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. ఆ ధైర్యంతోనే వారు ప్రతి సవాలును చాలా చాకచక్యంగా పరిష్కరించగలరు. వీరికి అనేక రంగాల్లో రాణించే శక్తి ఉంటుంది. సంకల్పం, చురుకుదనం, సృజనాత్మకత కలవారిగా, ఏ రంగంలోనైనా విజయాల సింహాసనాన్ని అధిరోహిస్తారు.

45
సమస్యలపై విజయం

ఈ సంఖ్యవారికి సమస్యలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఇతరులు గందరగోళంగా ఉండే పరిస్థితుల్ని వీరు చాకచక్యంగా పరిష్కరిస్తారు. వారి బుద్ధిమత్తం, కృషి కలగలిపి, వారిని ఎక్కడున్నా గౌరవం పొందేలా చేస్తాయి.

రాణించగల వృత్తులు..

వారు జర్నలిజం, రచన, బ్లాగింగ్, విద్య, మార్కెటింగ్, వ్యాపారం వంటి రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తారు. కమ్యూనికేషన్‌ నైపుణ్యం వల్ల వారు అందరినీ ఆకట్టుకుంటారు. వారి మాటల్లో మెస్మరైజ్ చేసే శక్తి ఉంటుంది.

55
అదృష్ట రంగులు, రోజులు

తెలుపు రంగు వారికి అదృష్టాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ, బుధునికి సంబంధించిన రంగు, వీరిలో ప్రశాంతతను తీసుకువస్తుంది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజులు శుభదాయకంగా భావిస్తారు.

బలాలు – కొన్నిసార్లు బలహీనతలే

వారు కొత్తదానిపై ఆసక్తి చూపుతూ ఉండటంతో జీవితంలో స్థిరత్వం ఉండదు. దీని వల్ల చాలా సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. జీవితాన్ని ఎప్పటికప్పుడు మార్చాలనే ఆత్రుత కొన్నిసార్లు నిరుత్సాహానికి దారితీయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories