Nirjala Ekadashi: ఈ ఏకాదశితో ఐదు రాశుల తలరాతే మారిపోనుంది, ఎంతలా అంటే..?

Published : Jun 05, 2025, 04:28 PM IST

ఈ ఏకాదశి రోజున బుధ గ్రహం మిథున రాశిలోకి అడుగుపెడుతోంది. దీని వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.

PREV
16
నిర్జల ఏకాదశి

ఈ ఏడాది జూన్ 6వ తేదీన, శుక్రవారం నిర్జల ఏకాదశి రానుంది. ఈ ఏకాదశి చాలా శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున బుధ గ్రహం మిథున రాశిలోకి అడుగుపెడుతోంది. దీని వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.దీని వల్ల ఐదు రాశులకు చాలా మేలు జరగనుంది. ముఖ్యంగా ఆ ఐదురాశుల తలరాతే మారిపోనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...

26
1.వృషభ రాశి(Taurus)

నిర్జల ఏకాదశి సమయంలో బుధుడు మిథున రాశిలోకి అడుగుపెట్టడం వల్ల వృషభ రాశివారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఈ కాలంలో మీరు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. అంటే, ఎందులో అయినా పెట్టుబడులు పెట్టినా, ఆస్తులు కొనుగోలు చేసినా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు కొన్ని సవాళ్లు ఎదురైనా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది.అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది.

36
2.సింహ రాశి (Leo)

నిర్జల ఏకాదశి సమయం సింహ రాశివారికి చాలా అదృష్టాన్ని మోసుకురానుంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. బుధుడి సంచారం వల్ల మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు, ఉద్యోగస్తులకు జీతవృద్ధి , పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. డిజిటల్ మార్గాలు లేదా పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

46
కన్య రాశి (Virgo)

మీ రాశికి అధిపతి అయిన బుధుడు పదోస్థానంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో, ఇది ఉజ్వల ఫలితాలు ఇవ్వగల సమయం. కెరీర్ పరంగా పురోగతి, సమాజంలో గౌరవం, కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. మీకు ఉన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఈ కాలంలో మీరు నాయకత్వ గుణాలు ప్రదర్శించి మంచి పేరు పొందుతారు.

56
వృశ్చిక రాశి (Scorpio)

ఈ సమయంలో ఆకస్మిక లాభాలు సాధ్యపడతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, బీమా, పన్ను, పరిశోధన రంగాల్లో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. కెరీర్ పరంగా అభివృద్ధి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ, మీరు మాట్లాడే విధానంపై జాగ్రత్త వహించాలి. ఏ పని చేయినా విజయవంతం కావడానికి మంచి కాలం.

66
మకర రాశి (Capricorn)

ఈ రాశివారికి ఈ సమయం విజయాల కాలం అవుతుంది. వ్యతిరేకులను అధిగమించే శక్తి, లక్ష్మీదేవి అనుగ్రహం, వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా విశ్లేషణాత్మక రంగాల్లో ఉన్నవారు కెరీర్ పరంగా మెరుగుదల చూస్తారు. రచన, జర్నలిజం వంటి రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories